క్రీడాభూమి

నికోల్స్ ఒంటరి పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, మార్చి 16: దక్షిణాఫ్రికాతో గురువారం ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలోనే న్యూజిలాండ్ ఆలౌటైంది. హెన్రీ నికోల్స్ ఒంటరి పోరాటం జరిపి సెంచరీ సాధించగా, మిగతా వారు తక్కువ పరుగులకే పరిమితం కావడంతో కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 268 పరుగులేకే ఆలౌటైంది. ఆతర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా, ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 11 పరుగుల స్కోరువద్ద మొదటి వికెట్‌ను కోల్పోయింది. ఆతర్వాత ఆటగాళ్లంతా పెవిలియన్‌కు క్యూకట్టగా, నికోల్స్ ఒక్కడే జట్టు కుప్పకూలకుండా పోరాటం సాగించాడు. అతను 161 బంతులు ఎదుర్కొని 118 పరుగులు చేసి, జెపి డుమినీ బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుటయ్యాడు. అతను శతకంతో రాణించకపోతే, కివీస్ పరిస్థితి దారుణంగా ఉండేది. జీత్ రావెల్ (36), బ్రాడ్లే వాల్టింగ్ (34) కొద్ది సేపు దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను ప్రతిఘటించారు. మిగతా వారు ఆ మాత్రం పోరాటం లేకుండానే పెవిలియన్ చేరారు. జెపి డుమినీ 47 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. మోర్న్ మోర్కెల్, కాగిసో రబదా, కేశవ్ మహారాజ్ తలా రెండు వికెట్లు కూల్చారు.
కివీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసిన ఆనందం దక్షిణాఫ్రికాకు ఎక్కువ సేపు నిలవలేదు. మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించి ఆ జట్టు 12 పరుగుల స్కోరువద్ద రెండు వికెట్లు కోల్పోయింది. స్టెఫెన్ కుక్ 3, డీన్ ఎల్గార్ 9 పరుగులు చేసి ఆవుటయ్యారు. ఆట ముగిసే సమయానికి ఆ జట్టు స్కోరు 24 పరుగులకు చేరుకోగా, కాగిసో రబదా (8), హషీం ఆమ్లా (0) క్రీజ్‌లో ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 79.3 ఓవర్లలో 268 ఆలౌట్ (హెన్రీ నికోల్స్ 118, జీత్ రావెల్ 36, బ్రాడ్లే వాల్టింగ్ 34, జీన్ పాల్ డుమినీ 4/47, మోర్న్ మోర్కెల్ 2/82, కాగిసో రబదా 2/59, కేశవ్ మహారాజ్ 2/47).