క్రీడాభూమి
ఆసీస్ కెప్టెన్‌పై సాహా ‘దాడి’!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాంచీ: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌పై భారత వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా దాదాపు దాడి చేశాడు. ఈ సంఘటనలో స్మిత్ కింపడ్డాడు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, స్పిత్ 97 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రవీంద్ర జడేజా వేసిన బంతిని రక్షణాత్మకంగా ఆడాడు. అయితే, బంతి కింద పడక ముందే దానిని అందుకోవాలన్న పట్టుదలతో స్టంప్స్ పైనుంచి క్రీజ్‌లోకి లంఘించిన సాహా దానిని ఒడిసిపట్టుకున్నాడు. ఈ విషయాన్ని గమనించని స్మిత్ హఠాత్తుగా తన కాళ్ల ముందు కనిపించిన సాహాను చూసి విస్తుబోయాడు. బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు. స్మిత్‌ను గమనించకుండా సాహా తాను క్యాచ్ పట్టానంటూ అప్పీల్ చేయడం విచిత్రం. అంపైర్ ఇయాన్ గౌల్ట్ అతని అప్పీల్‌ను తిరస్కరించాడు. అయితే, పాపింగ్ క్రీజ్‌లోకి వచ్చి, తనను కింద పడేసిన సాహాపై స్మిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య స్వల్పంగా వాగ్వాదం చోటు చేసుకుంది. అంపైర్ జోక్యంతో వివాదానికి తెరపడింది.
చిత్రం..స్మిత్‌ను కిందపడేసి, అతను అవుటైనట్టు అప్పీల్ చేస్తున్న భారత వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా