క్రీడాభూమి

తప్పుడు సమాచారమిస్తే ఇకపై కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్‌ల నిర్వహణ ఖర్చులపై తప్పుడు సమాచారమిచ్చే సభ్య సంఘాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు నియమించిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పాలనా వ్యవహారాల కమిటీ (సిఒఎ) నిర్ణయించింది. శుక్రవారం జరిగిన సమావేశంలో లోధా సిఫార్సు అమలు, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్ పదవికి శశాంక్ మరోహర్ రాజీనామా వంటి పలు అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. బోర్డు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఐపిఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై సభ్య సంఘాలు తరచు తప్పుడు సమాచారం ఇస్తున్నట్టుగా సిఒఎ గుర్తించింది. నిజానికి మ్యాచ్‌ల నిర్వహణకు అవుతున్న ఖర్చులో సగం మొత్తాన్ని ఆయా ఫ్రాంచైజీలు, మిగతా సగాన్ని బిసిసిఐ భరిస్తున్నాయి. ఉదాహరణకు ఒక మ్యాచ్‌కి 60 లక్షల రూపాయలు ఖర్చపెడితే, అందులో 30 లక్షలను హోం జట్టు ఫ్రాంచైజీ ఇస్తుంది. మిగతా 30 లక్షలను బిసిసిఐ చెల్లిస్తుంది. ఇందులో సంబంధిత క్రికెట్ సంఘాలకు ఒక్కపైసా కూడా ఖర్చుకాదు. కానీ, వివిధ సందర్భాల్లో ఎక్కువ శాతం క్రికెట్ సంఘాలు ఐపిఎల్ మ్యాచ్‌లకు భారీగా ఖర్చవుతున్నదంటూ, బోర్డు నుంచి ఆర్థిక సాయం కోసం అందాల్సిన అవసరం ఉందంటూ రాద్ధాంతం సృష్టిస్తున్నాయి. ఇకపై ఇలాంటి తప్పుడు సమాచారమిస్తే, భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.