క్రీడాభూమి

మాక్స్‌వెల్ తొలి శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్స్‌లోనూ కనీసం ఒక సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్ గ్లేన్ మాక్స్‌వెల్. ఇంతకు ముందు షేన్ వాట్సన్ ఈ ఘనతను అందుకోగా, రాంచీలో సెంచరీ చేసిన మాక్స్‌వెల్ కూడా అతని సరసన చోటు దక్కించుకున్నాడు. టెస్టుల్లో అతనికి ఇదే మొదటి శతకం. ఇంతకు ముందు అతని అత్యధిక స్కోరు 37 పరుగులు.

**
రాంచీ, మార్చి 17: గ్లేన్ మాక్స్‌వెల్ కెరీర్‌లో తొలి టెస్టు సెంచరీని నమోదు చేయగా, భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 451 పరుగులు సాధించగలిగింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన స్టీవెన్ స్మిత్ 178 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం. రెండో రోజు ఆటను 4 వికెట్లకు 299 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆరంభించిన ఆస్ట్రేలియా 331 పరుగుల వద్ద మాక్స్‌వెల్ వికెట్‌ను కోల్పోయింది. అతను 185 బంతులు ఎదుర్కొని, 104 పరుగులు చేసిన తర్వాత రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుటయ్యాడు. అతని స్కోరులో తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. స్మిత్ క్రీజ్‌లో నిలదొక్కుకొని నాటౌట్‌గా మిగిలాడు. 361 బంతులు ఎదుర్కొన్న అతను 17 ఫోర్లతో 178 పరుగులు చేసి, టీమిండియాపై భారత్‌లో ఆస్ట్రేలియా తరఫున మూడో అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. రవీంద్ర జడేజా 49.3 ఓవర్లు బౌలర్ చేసి, 124 పరుగులిచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. ఉమేష్ యాదవ్‌కు మూడు వికెట్లు లభించాయి.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి లోకేష్ రాహుల్ (67) వికెట్‌ను కోల్పోయి 120 పరుగులు చేసింది. మురళీ విజయ్ 42, చటేశ్వర్ పుజారా 10 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ స్కోరును సమం చేయాలంటే టీమిండియా ఇంకా 331 పరుగులు చేయాలి. 9 వికెట్లు చేతిలో ఉన్నాయి.

చిత్రం..కెరీర్‌లో మొదటిసారి టెస్టు సెంచరీ చేసిన గ్లేన్ మాక్స్‌వెల్