క్రీడాభూమి

‘మహారాజ్’ శాసనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, మార్చి 18: మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ విజృంభణ న్యూజిలాండ్‌ను దారుణంగా దెబ్బసింది. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే కుప్పకూలిన కివీస్ ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొమ్మిది వికెట్లకు 349 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ మూడో రోజైన శనివారం ఉదయం ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా 359 పరుగుల వద్ద ఆలౌటైంది. అందుకు ముందు న్యూజిలాండ్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 268 పరుగులకే కట్టడి చేయడంతో దక్షిణాఫ్రికాకు 91 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ దారుణంగా విఫలమైంది. జీత్ రావెల్ 80 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అతనితోపాటు నీల్ బ్రూమ్ (20), బ్రాడ్లే వాల్టింగ్ (29) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారు సింగిల్ డిజిట్స్‌కే పెవిలియన్ చేరగా, న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌కు 171 పరుగుల వద్ద తెరపడింది. కేవశ్ మహారాజ్ తన కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణను నమోదు చేసి, 40 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 81 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా, స్టెఫెన్ కుక్ (11), డీన్ ఎల్గార్ (17) వికెట్లు కోల్పోయి, 23.4 ఓవర్లలో 83 పరుగులు చేసి, ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అప్పటికి హషీం ఆమ్లా (38), జెపి డుమినీ (15) క్రీజ్‌లో ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 79.3 ఓవర్లలో 268 ఆలౌట్ (హెన్రీ నికోల్స్ 118, జీత్ రావెల్ 36, బ్రాడ్లే వాల్టింగ్ 34, జీన్ పాల్ డుమినీ 4/47, మోర్న్ మోర్కెల్ 2/82, కాగిసో రబదా 2/59, కేశవ్ మహారాజ్ 2/47).
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 98 ఓవర్లలో 359 ఆలౌట్ (టెంబా బవూమా 89, క్వింటన్ డి కాక్ 91, వెర్నర్ ఫిలాండర్ 37 నాటౌట్, మోర్న్ మోర్కెల్ 40, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 3/52, నీల్ వాగ్నర్ 3/102, టిమ్ సౌథీ 2/98).
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 63.2 ఓవర్లలో 171 ఆలౌట్ (జీత్ రావెల్ 80, నీల్ బ్రూమ్ 20, బ్రాడ్లే వాల్టింగ్ 29, కేశవ్ మహారాజ్ 6/40, మోర్న్ మోర్కెల్ 3/50).
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 81 పరుగులు): 23.4 ఓవర్లలో 2 విట్లకు 83 (హషీం ఆమ్లా 38 నాటౌట్, జెపి డుమినీ 15 నాటౌట్).

చిత్రం..కేశవ్ మహారాజ్