క్రీడాభూమి

పుజారా అజేయ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మార్చి 18: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్లకు 360 పరుగులు చేసింది. ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా అజేయ శతకంతో రాణించి, జట్టును ఆదుకున్నాడు. రెండో రోజు ఆటలో లోకేష్ రాహుల్ (67) వికెట్‌ను కోల్పోయి 120 పరుగులు చేసిన భారత్ శనివారం ఉదయం ఆటను కొనసాగించి, 193 పరుగుల వద్ద మురళీ విజయ్ వికెట్‌ను కోవల్పోయింది. అతను 183 బంతులు ఎదుర్కొని, 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 82 పరుగులు చేసి, స్టీవ్ ఒకీఫ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి, వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్ స్టంప్ చేయగా అవుటయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. ఏడు పరుగులు చేసిన అతను పాట్ కమిన్స్ బౌలింగ్‌లో స్టీవెన్ స్మిత్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. ఆజింక్య రహానే (14), కరుణ్ నాయర్ (23), రవిచంద్రన్ అశ్విన్ (3) పరుగుల వేటలో విఫలమయ్యారు. అయితే, పుజారా క్రీజ్‌లో పాతుకుపోయి, భారత్ పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. అతను 328 బంతులు ఎదుర్కొని 130 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. వృద్ధిమాన్ సాహా 18 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత్ 130 ఓవర్లలో ఆరు వికెట్లకు 360 పరుగులు చేసింది. ఆసీస్ కంటే ఇంకా 91 పరుగులు వెనుకంజలో ఉన్న టీమిండియా చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి.
ఇలావుంటే, మురళీ విజయ్, చటేశ్వర్ పుజారా 2016-2017 సీజన్‌లో వంద లేదా అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని అందించడం ఇది ఆరుసారి. ఒక సీజన్‌లో మాథ్యూ హేడెన్, రికీ పాంటింగ్ ఏడుసార్లు ఈ విధంగా వందకుపైగా తొలి వికెట్ పార్ట్‌నర్‌షిప్స్‌ను సాధించి మొదటి స్థానంలో ఉండగా, విజయ్, పుజారా రెండో స్థానాన్ని ఆక్రమించారు. ఒక ఇన్నింగ్స్ లో భారత జట్టులోని మొదటి ముగ్గురు బ్యాట్స్‌మెన్ 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం 2010 నాటపూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు తర్వాత ఇదే మొదటిసారి. 2006 నుంచి 2010 వరకు ఎనిమిది పర్యాయాలు భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఈ ఫీట్ సాధిస్తే, గత ఏడేళ్ల కాలంలో ఇదే తొలిసారి.
స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: మాట్ రెన్‌షా సి విరాట్ కోహ్లీ బి ఉమేష్ యాదవ్ 44, డేవిడ్ వార్నర్ సి అండ్ బి రవీంద్ర జడేజా 19, స్టీవెన్ స్మిత్ 178 నాటౌట్, షాన్ మార్ష్ సి చటేశ్వర్ పుజారా బి అశ్విన్ 2, పీటర్ హ్యాండ్స్‌కోమ్ ఎల్‌బి ఉమేష్ యాదవ్ 19, గ్లేన్ మాక్స్‌వెల్ సి వృద్ధిమాన్ సాహా బి రవీంద్ర జడేజా 104, మాథ్యూ వేడ్ సి వృద్ధిమాన్ సాహా బి రవీంద్ర జడేజా 37, పాట్ కమిన్స్ బి రవీంద్ర జడేజా 0, స్టీవ్ ఒకీఫ్ సి మురళీ విజయ్ బి ఉమేష్ యాదవ్ 25, నాథన్ లియాన్ సి కరుణ్ నాయర్ బి రవీంద్ర జడేజా 1, జొష్ హాజెల్‌వుడ్ రనౌట్ 0, మొత్తం 137.3 ఓవర్లలో 451 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-50, 2-80, 3-89, 4-140, 5-331, 6-395, 7-395, 8-446, 9-449, 10-451.
బౌలింగ్: ఇశాంత్ శర్మ 20-2-70-0, ఉమేష్ యాదవ్ 31-3-106-3, రవిచంద్రన్ అశ్విన్ 34-3-114-1, రవీంద్ర జడేజా 49.3-8-124-5, మురళీ విజయ్ 3-0-17-0.
భారత్ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు వికెట్ నష్టానికి 120): లోకేష్ రాహుల్ సి మాథ్యూ వేడ్ బి పాట్ కమిన్స్ 67, మురళీ విజయ్ స్టంప్డ్ మాథ్యూ వేడ్ బి స్టీవ్ ఒకీఫ్ 82, చటేశ్వర్ పుజారా 130 నాటౌట్, విరాట్ కోహ్లీ సి స్టీవెన్ స్మిత్ బి పాట్ కమిన్స్ 6, ఆజింక్య రహానే సి మాథ్యూ వేడ్ బి పాట్ కమిన్స్ 14, కరుణ్ నాయర్ బి జొస్ హాజెల్‌వుడ్ 23, రవిచంద్రన్ అశ్విన్ సి మాథ్యూ వేడ్ బి పాట్ కమిన్స్ 3, వృద్ధిమాన్ సాహా 18 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 17, మొత్తం (130 ఓవర్లలో 8 వికెట్లకు) 360.
వికెట్ల పతనం: 1-91, 2-193, 3-225, 4-276, 5-320, 6-328.
బౌలింగ్: జొష్ హాజెల్‌వుడ్ 31-9-66-1, పాట్ కమిన్స్ 25-8-59-4, స్టీవ్ ఒకీఫ్ 43-11-117-1, నాథన్ లియాన్ 29-2-97-0, గ్లేన్ మాక్స్‌వెల్ 2-0-4-0.
**
రాంచీలోని జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం (జెఎస్‌సిఎ) స్టేడియంలో సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా చటేశ్వర్ పుజారా చరిత్ర సృష్టించాడు. ఈ ఫస్ట్ క్లాస్ సీజన్‌లో అతనికి ఇది ఏడో శతకం. ఒక సీజన్‌లో ఎక్కువ శతకాలు చేసిన బ్యాట్స్‌మన్‌గా, ఎనిమిది సెంచరీలతో వివిఎస్ లక్ష్మణ్ అగ్రస్థానాన్ని ఆక్రమిస్తే, నవాబ్ ఆఫ్ పటౌడీ, సునీల్ గవాస్కర్ ఒక ఫస్ట్‌క్లాస్ సీజన్‌లో ఏడు సెంచరీలు సాధించగా, వారి సరసన పుజారా జోటు దక్కించుకున్నాడు.