క్రీడాభూమి

రేసర్ సుందర్ మృతి పట్ల దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 18: మోటార్ రేసర్ అశ్విన్ సుందర్ ఒక కారు ప్రమాదంలో సజీవ దహనమైన సంఘటనపై భారత మోటర్ స్పోర్ట్స్ సంఘాల సమాఖ్య (ఎంఎఫ్‌ఎస్‌సిఐ) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సుందర్‌ను ప్రతిభావంతుడైన రేసర్‌గా అభివర్ణించిన సమాఖ్య అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ సంఘటనలో సుందర్ భార్య నివేదిత కూడా సజీవ దహనం కావడం అత్యంత విచారకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నామని ప్రకటించింది. 1985 జూలై 27న చెన్నైలో జన్మించిన సుందర్ జాతీయ స్థాయిలో పలు ఫార్ములా రేసులను సాధించాడు. 2003లో ఎంఆర్‌ఎఫ్ పార్ములా మోండియన్ జాతీయ చాంపియన్‌షిప్‌ను సాధించిన అతను మరుసటి సంవత్సరం దానిని నిలబెట్టుకున్నాడు. అదే ఏడాది ఫార్ములా ఎఫ్‌ఐఎస్‌ఎస్‌ఎంఇ (800 సిసి), ఫార్ములా ఎల్‌జిబి (1,000 సిసి) చాంపియన్‌షిప్స్‌లో అరంగేట్రం చేసి, నాలుగో స్థానంలో నిలిచాడు. ఫార్ములా కార్ రేసింగ్‌లోనేగాక, మోటార్ సైకిల్ రేసింగ్‌లోనూ ప్రావీణ్యం సంపాదించిన అతను 2005లో అతను 150 సిసి ‘్ఫర్ స్ట్రోక్’ విభాగంలో జాతీయ రోడ్ రేసింగ్ చాంపియన్‌షిప్ సాధించాడు. 2006లో 115 సిసి (్ఫర్ స్ట్రోక్), 150 సిసి (4 స్ట్రోక్ క్లాస్) ఈవెంట్స్‌లో భారత చాంపియన్‌గా నిలిచాడు. అదే ఏడాది ఎఫ్‌ఐఎం ఆసియా రోడ్ రేసింగ్ అండర్-21 ఈవెంట్‌లో జాతీయ చాంపియన్‌షిప్‌ను అందుకున్నాడు. ఫార్ములా స్విప్ట్, ఫార్ములా హ్యుందయ్ రేసులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 2007లో మరోసారి ఈ రెండు విభాగాల్లోనూ జాతీయ చాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నాడు. 2010లో ఎంఆర్‌ఎఫ్ ఫార్ములా 1,600 ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. మరుసటి ఏడాది ఆ టైటిల్‌ను నిలబఎట్టుకున్నాడు. 2012లో ఎఫ్-4 జాతీయ చాంపియన్‌షిప్‌ను సాధించిన అతను 2013లో దానిని విజయవంతంగా నిలబెట్టుకున్నాడు.
అమ్మేస్తానన్నాడు!
తన బిఎండబ్ల్యు కారును అమ్మేసి, కొత్తది తీసుకుంటానని ఇటీవలే అశ్విన్ సుందర్ తనతో చెప్పాడని, ఆ కారులోనే అతను ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని అతని చిన్ననాటి మిత్రుడు కిరణ్ చెప్పాడు. అర్ధరాత్రి సుమారు 2 గంటల 15 నిమిషాల సమయంలో తనకు పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని, వెంటనే సంఘటన స్థలానికి వెళ్లగా, అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైందని కిరణ్ అన్నాడు. పోలీసులు తనకు ఒక సిమ్ కార్డు ఇచ్చారని, ఫోన్‌లో వేసి చూస్తే, అది సుందర్ భార్య నివేదితదిగా తెలిసిందని అన్నాడు. శ్రీలంక జాతీయురాలైన నివేదిక చెన్నైలోని శ్రీ రామచంద్ర యూనివర్శిటీలో ఇటీవలే మెడిసిన్ పూర్తి చేసిందని చెప్పాడు. నివేదిత చదువు పూర్తికావడంతో, త్వరలోనే హనీమూన్‌కు వెళ్లనున్నట్టు సుందర్ తనకు చెప్పాడని, ఈలోపే ఇలాంటి దుర్ఘటన జరగడం దురదృష్టకరమని వాపోయాడు.
స్పీడ్ బ్రేకరే కారణం!
చెన్నై: అశ్విన్ సుందర్ కారు ప్రమాదానికి గురికావడానికి స్పీడ్ బ్రేకరే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. లీలా ప్యాలెస్‌లో రాత్రి భోజనం ముగించుకొని పోరూర్ వద్దగల అలాపాక్కంలోని నివాసానికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా, శుక్రవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో కారు ఒక చెట్టుకు ఢీకొంది. వెంటనే మంటలు చెలరేగడంతో సుందర్, అతని భార్య నివేదిత ప్రాణాలతో బయటపడలేకపోయారు. కారు దగ్ధమైన ప్రదేశానికి సుమారు పది అడుగుల దూరంలో, డాక్టర్ డిజిఎస్ దినారన్ సలాయ్ రోడ్డుపై ఒక స్పీడ్ బ్రేకర్ ఉండడంతో, అదే ప్రమాదానికి కారణమని పోలీసుల అనుమానం. కారును వేగంగా నడుపుతున్నందువల్ల సుందర్ పట్టుకోల్పోయాడని, ఫలితంగా వాహనం అదే వేగంతో చెట్టును ఢీకొనడంతో మంటలు చెలరేగాయని అంటున్నారు. ప్రమాదాల నుంచి బయటపడేందుకు కారులో కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయని, కానీ, వాటిని ఉపయోగించుకోక ముందే మంటలు పూర్తిగా వ్యపించడంతో సుందర్, అతని భార్య నివేదిత బయటకు రాలేకపోయారి ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే వివరాలు తెలుస్తాయని అన్నారు.