క్రీడాభూమి

దేవధర్ ట్రోఫీలో ఇండియా ‘బి’ జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), మార్చి 26: దేవధర్ ట్రోఫీ పోటీల్లో ఇండియా ‘బి’ జట్టు జోరు కొనసాగుతోంది. తొలిమ్యాచ్‌లో ఇండియా ‘ఎ’పై 23 పరుగుల ఆధిక్యతతో గెలుపొందిన ఇండియా ‘బి’ రెండో మ్యాచ్‌లో తమిళనాడు జట్టును 32 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్స్‌లోకి దూసుకువెళ్లింది. బ్యాటింగ్‌లో చెలరేగిపోతున్న ఇండియా ‘బి’, ఈ మ్యాచ్‌లో కూడా అదే ఊపుతో 316 పరుగుల స్కోరును నమోదు చేసింది. మనీష్ పాండే సెంచరీ, అక్షర్ పటేల్, శిఖర్‌ధావన్ అర్ధసెంచరీలతో జట్టుకు భారీ స్కోరును అందించారు. తమిళనాడు జట్టులో కౌశిక్ గాంధీ సెంచరీ, జగదీశన్ అర్ధసెంచరీతో ప్రత్యర్థికి దీటుగా సమాధానం ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఇక్కడి ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా ‘బి’ 8 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది. ఆట ప్రారంభంలోనే పార్థీవ్‌పటేల్ వికెట్‌ను కోల్పోయినప్పటికీ శిఖర్‌ధావన్, మనీష్ పాండే నిలకడగా ఆడి రెండో వికెట్‌కు 86 పరుగులు జత చేశారు. శిఖర్‌ధావన్ 6 బౌండరీలు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసి జట్టు స్కోరు 100 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత గోవింద్‌పోదార్, ఇశాంత్ జగ్గీల వికెట్లను త్వరగా కోల్పోయినప్పటికీ అక్షర్‌పటేల్ తోడుగా నిలవడంతో మనీష్‌పాండే స్కోరును పరుగులు తీయించాడు. అక్షర్‌పటేల్ 52 (ఒక బౌండరీ, 4 సిక్సర్లు), మనీష్ పాండే 104 (5 బౌండరీలు, 4 సిక్సర్లు) వరుసగా అవుట్ కావడంతో ఇండియా ‘బి’ జట్టు 41.4 ఓవర్లలో 259 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. చివరిలో గురుకీరత్‌మాన్(25), కార్నేవార్(28) బాధ్యతాయుతంగా ఆడడంతో 316 పరుగులు సాధించింది. తమిళనాడు బౌలర్లలో సాయికిశోర్ నాలుగు వికెట్లు, మహమ్మద్, వాషింగ్టన్, ఆంథోనీదాస్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
అనంతరం 317 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు జట్టుకు కౌశిక్‌గాంధీ అండగా నిలిచాడు. కౌశిక్‌గాంధీ 9 బౌండరీలతో 124 పరుగులు చేసి జట్టును గెలుపుబాట పట్టించాడు. కౌశిక్‌కు తోడుగా జగదీషన్ 64(5 బౌండరీలు, 3 సిక్సర్లు), దినేష్‌కార్తీక్ 28, విజయశంకర్ 27 పరుగులు చేసి ప్రత్యర్థికి దీటైన సమాధానం ఇచ్చినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. ఇండియా ‘బి’ జట్టు బౌలర్లలో ధవళ్ కులకర్ణి, అక్షర్ పటేల్ చెరో మూడు వికెట్లు, కుల్వంత్ కేజరోలీ, మిలన్ చెరో రెండు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. శనివారం జరిగే మ్యాచ్‌లో ఇండియా ‘ఎ’, తమిళనాడు జట్లు తలపడతాయి.

చిత్రం..మనీష్ పాండే