క్రీడాభూమి

ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీ విజేత వెటల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, మార్చి 26: ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్‌ను సాధించిన ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ ఈ సీజన్‌లో బోణీ కొట్టాడు. ఈ సీజన్‌లో మొత్తం 20 రేసులు జరగనుండగా, వాటిలో మొదటిదైన ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీలో ప్రపంచ చాంపియన్, మెర్సిడిజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ రెండో స్థానంతో సరిపుచ్చుకున్నాడు. 57 ల్యాప్స్‌ను ఒక గంట, 24.11 నిమిషాల్లో పూర్తి చేసిన వెటల్‌కు 25 పాయింట్లు లభించాయి. అతని కంటే 9.975 సెకన్లు ఆలస్యంగా రేస్‌ను పూర్తి చేసిన హామిల్టన్ 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మెర్సిడిజ్‌కే చెందిన వల్టారి బొటాస్‌మెర్స్ 15 పాయింట్లు సంపాదించి, మూడో స్థానాన్ని సంపాదించుకున్నాడు.
ఫోర్స్ ఇండియాకు పాయింట్లు
ఈ రేసులో ఫోర్స్ ఇండియాకు ఏడు పాయింట్లు లభించాయి. సెర్గీ పెరెజ్ ఆరు పాయింట్లు సంపాదించగా, ఎస్టానొకన్ ఒక పాయింట్ అందించాడు.

చిత్రం.. ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్ తర్వాత పోడియం వద్ద విజేత సెబాస్టియన్ వెటల్ (కుడి)పై షాంపైన్ కురిపిస్తున్న ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్