క్రీడాభూమి

నలుగురూ సింగిల్స్ ఆటగాళ్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: ఉజ్బెకిస్తాన్‌తో డేవిస్ కప్ టెన్నిస్ పోరు కోసం భారత జట్టు కూర్పు విషయంలో నాన్-ప్లేయింగ్ కెప్టెన్ మహేష్ భూపతి మంగళవారం ఎంతో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. నలుగురూ సింగిల్స్ ఆటగాళ్లకే ఈ జట్టులో చోటు కల్పించిన భూపతి, వెటరన్ స్టార్ ఆటగాడైన లియాండర్ పేస్‌తో పాటు మరో డబుల్స్ ఆటగాడైన రోహన్ బొపన్ననను రిజర్వు సభ్యులుగా ఉంచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బెంగళూరులో ఏప్రిల్ 7 నుంచి 9వ తేదీ వరకు జరిగే ఈ పోరు కోసం భూపతి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 269వ స్థానంలో కొనసాగుతున్న రామ్‌కుమార్ రామనాథన్‌తో పాటు యూకీ బాంబ్రీ (307వ ర్యాంకు), ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ (325వ ర్యాంకు), ఎన్.శ్రీరామ్ బాలాజీ (350వ ర్యాంకు)లకు భారత ప్లేయింగ్ జట్టులో చోటు కల్పించాడు. గతంలో ఎన్నడూ భారత డేవిస్ కప్ జట్టులో నలుగురూ సింగిల్స్ స్పెషలిస్టులకే చోటు కల్పించిన దాఖలాలు లేకపోయినప్పటికీ భూపతి ఈ విధంగా వ్యవహరిండం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి భారత జట్టులో డబుల్స్ ఆటగాళ్లనే ప్రధాన బలంగా పరిగణించేవారు. 1990వ దశకం చివరి వరకు మహేష్ భూపతి, లియాండర్ పేస్ కేవలం డేవిస్ కప్ పోటీల్లోనే కాకుండా ఎటిపి వరల్డ్ టూర్ పోటీల్లోనూ సత్తా చాటడమే ఇందుకు కారణం. అయినప్పటికీ ఉజ్బెకిస్తాన్‌తో డేవిస్ కప్ పోరు కోసం భారత జట్టు కూర్పు విషయమై తనకు గల హక్కును ఉపయోగించి ప్రస్తుతానికి నలుగురూ సింగిల్స్ ఆటగాళ్లనే ఎంచుకున్నానని భూపతి చెప్పాడు. అయితే ఏప్రిల్ 7వ తేదీన పోరు ప్రారంభం కావడానికి ముందు ఇద్దరు సభ్యులను మార్చుకునేందుకు నిబంధనలు అనుమతిస్తున్నందున భారత తుది జట్టు స్వరూపం మారే అవకాశాలు లేకపోలేదు.