క్రీడాభూమి

పాక్ ఖాతాలో టి-20 సిరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ఏప్రిల్ 3: వెస్టిండీస్‌తో జరిగిన చివరి, నాలుగో టి-20 మ్యాచ్‌ని ఏడు వికెట్ల తేడాతో గెల్చుకున్న పాకిస్తాన్ ఈ సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతకు ముందు మొదటి రెండు మ్యాచ్‌ల్లో పాక్ విజయం సాధించగా, మూడో మ్యాచ్‌ని దక్షిణాఫ్రికా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్‌ను డ్రా చేసుకోవాలంటే, చివరి మ్యాచ్‌ని తప్పక గెలవాల్సిన స్థితిలో వెస్టిండీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 124 పరుగులు చేసింది. చాడ్‌విక్ వాల్టన్ (40), కెప్టెన్ కార్లొస్ బ్రాత్‌వెయిట్ (37 నాటౌట్) తప్ప ఎవరూ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేదు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, షాబాద్ ఖాన్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ చివరి బంతిలో గెలిచింది. మూడు వికెట్లు కోల్పోయి ఈ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అహ్మద్ షెజాద్ (53) అర్ధ శతకంతో పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ (38) కూడా చక్కటి ప్రతిభ కనబరిచాడు. కీలకమైన చివరి మ్యాచ్‌లో గెలవడం ద్వారా పాక్ ఈ సిరీస్‌ను సాధించింది.