క్రీడాభూమి

ఐపిఎల్‌ ట్రివియా ఆకర్షణలెన్నో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఐపిఎల్‌లో ఎన్నో ఆకర్షణలున్నాయి. అందుకే, ఇది ఇంతగా విజయవంతమైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న క్రిస్ గేల్ 2013లో పుణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 2010లో ముంబయి ఇండియన్స్‌పై యూసుఫ్ పఠాన్ (రాజస్థాన్ రాయల్స్) 37, 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై డేవిడ్ మిల్లర్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) 38 బంతుల్లోనే సెంచరీలు సాధించారు. ఇలాంటి వీర బాదుడుతో బ్యాట్స్‌మెన్ చెలరేగిపోతే, సహజంగానే ప్రేక్షకులు హర్షధ్వానాలతో వారిని ఆకాశానికి ఎత్తేస్తారు. గేల్ ఇప్పటి వరకూ 88 ఇన్నింగ్స్‌లో 243 సిక్సర్లు కొడితే, రోహిత్ శర్మ 138 ఇన్నింగ్స్‌లో 163, సురేష్ రైనా 141 ఇన్నింగ్స్‌లో 160 చొప్పున సిక్సర్లు సాధించారు. గేల్ ఒక ఇన్నింగ్స్‌లో 17 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు. ఇలాంటి సునామీ బ్యాటింగ్‌ను చూసేందుకు అభిమానులు విరగబడడంతో వింత ఏమీలేదు.
ఛేజింగ్‌లో మేటి రాజస్థాన్
ఐపిఎల్ టోర్నీలో మొదటి ట్రోఫీని గెల్చుకున్న జట్టుగానేకాక, అత్యధిక పరుగులను ఛేజ్ చేసిన జట్టుగానూ రాజస్థాన్ రాయల్స్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించింది. 2008లో డక్కన్ చార్జర్స్‌పై ఏడు వికెట్లకు 217 పరుగులు సాధించి, లక్ష్యాన్ని ఛేదించింది. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కింగ్స్ ఎలెవెన్ నాలుగు వికెట్లకు 211 పరుగులు, 2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్లకు 208 పరుగులతో చేజింగ్‌లో మేటిగా నిరూపించుకున్నాయి. 2014లో చెన్నై సూపర్ కింగ్స్‌పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ నాలుగు వికెట్లకు 206 పరుగులతో విజయాన్ని నమోదు చేసింది. 2010లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, అదే ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ రెండు వికెట్లకు 204 చొప్పున ఒకే రకమైన స్కోర్లు చేయడం విశేషం.
తక్కువ స్కోర్లు చేసినా..
తొలుత బ్యాటింగ్‌కు దిగి, తక్కువ స్కోర్లకే పరిమితమైనప్పటికీ, ఆతర్వాత ప్రత్యర్థులను అంతకంటే తక్కువ పరుగులకే కట్టడి చేసి విజయం సాధించిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్‌ను అగ్రగామిగా పేర్కోవాలి. 2009లో ఈ జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 116 పరుగులు మాత్రమే చేసింది. అయితే, అనంతరం ప్రత్యర్థి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను 8 వికట్లెకు 92 పరుగుల వద్ద నిలిపేసి విజయాన్ని నమోదు చేసింది. అదే ఏడాది ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 8 వికెట్లకు 119 పరుగులు చేసింది. కానీ, ఈ సాధారణ లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయిన ముంబయి ఏడు వికెట్లకు 116 పరుగులు చేసి, మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 2013 సీజన్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌తో తలపడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది వికెట్లకు 119 పరుగులు చేసింది. అయితే, ప్రత్యర్థిని 108 పరుగులకే ఆలౌట్‌చేసి, 11 పరుగుల తేడాతో గెలిచింది. 2012లో ముంబయి ఇండియన్స్ (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌పై) 9 వికెట్లకు 120, 2008లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (చెన్నై సూపర్ కింగ్స్‌పై) 8 వికెట్లకు 126, 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌పై) 6 వికెట్లకు 126 పరుగుల సాధారణ స్కోర్లను కూడా సమర్థంగా రక్షించుకున్నాయి.

చిత్రం..ఐపిఎల్‌లో పరుగుల వరద పారించే క్రిస్ గేల్