క్రీడాభూమి

ఫెదరర్‌కు టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీ బిస్కేన్, ఏప్రిల్ 3: మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌ను ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ గెల్చుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో మాదిరిగానే ఈ టోర్నీ ఫైనల్‌లోనూ అతను ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్‌తో తలపడ్డాడు. గట్టిపోటీనిస్తాడనుకున్న నాదల్ పేలవమైన ఆటతో అభిమానులను నిరాశపరచగా, ఫెదర్ 6-3, 6-4 తేడాతో వరుస సెట్లలో విజయభేరి మోగించాడు. ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన ఆటగాళ్లలో ఎక్కువ వయసున్న వాడిగా 35 ఏళ్ల ఫెదరర్ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌లో ఫెదరర్ చేతిలో ఓడిన నాదల్ ప్రతీకారం తీర్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక, మరోసారి పరాజయంపాలయ్యాడు.
సానియా జోటీ ఓటమి
మహిళల డబుల్స్‌లో బార్బరా స్ట్రయికోవాతో కలిసి ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫైనల్‌లో ఓటమిపాలైంది. వీరిని గాబ్రియెలా డబ్రొవ్‌స్కీ, జూ ఇఫాన్ జోడీ 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.

చిత్రం..మియామీ ట్రోఫీతో రోజర్ ఫెదరర్