క్రీడాభూమి

డోపింగ్ జాబితాలో మనది మూడో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: అంతర్జాతీయంగా క్రీడల రంగంలో రాణించే విషయం ఎలా ఉన్నప్పటికీ డోపింగ్ ఉల్లంఘనల్లో మాత్రం మన దేశం ఇతర దేశాలకు ఏమాత్రం తీసిపోనని నిరూపించుకుంది. 2015 సంవత్సరానికి గాను ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజన్సీ అయిన ‘వాడా’ రూపొందించిన జాబితాలో మన దేశం వరసగా మూడో సంవత్సరం కూడా మూడో స్థానంలో నిలిచింది. నిషేదిత ఉత్ప్రేరకాలను వాడినందుకు ఏడాది మొత్తం మీద 117 మంది భారతీయ అథ్లెట్లు శిక్షలను ఎదుర్కొన్నారు. రష్యా ఫెడరేషన్ 176మంది క్రీడాకారులతో అగ్రస్థానంలో ఉండగా, ఇటలీ 129 మందితో రెండో స్థానంలో నిలిచింది. అంతకు ముందు రెండేళ్లు కూడా తొలి మూడు స్థానాల్లో ఈ దేశాలే ఉండడం గమనార్హం. ఈ ఏడాది జనవరి 31 దాకా వివిధ యాంటీ డోపింగ్ ఏజన్సీలు విధించిన శిక్షల ఆధారంగా ‘వాడా‘ ఈ జాబితాను రూపొందించింది. 2013లో వాడా ఈ జాబితాను తొలిసారిగా రూపొందించినప్పటినుంచి కూడా భారత్ జాబితాలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ డోప్ నేరానికి పాల్పడిన వారి సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగించే అంశం. 2013లో యాంటీ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించిన వారి సంఖ్య 91 కాగా, 2014లో 96కు పెరిగారు. కాగా, 2015 సంవత్సరంలో యాంటీ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు రుజువయి శిక్షలకు గురయిన 117 మందిలో 78 మంది మగవారు.