క్రీడాభూమి

ఆసియా చాంపియన్‌షిప్స్‌కు కర్మాకర్ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: థాయిలాండ్‌లో వచ్చే నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆసియా చాంపియన్‌షిప్స్ మీట్ నుంచి భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ (23) వైదొలిగింది. మోకాలి గాయంతో బాధపడుతున్న ఆమె శస్త్ర చికిత్స చేయించుకునేందుకు వెళ్లడమే ఇందుకు కారణం. ఇటీవల ప్రాక్టీస్ సందర్భంగా గాయపడిన తాను ముంబయిలో ఎసిఎల్ (యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్) శస్త్ర చికిత్స చేయించుకోబోతున్నానని, అందువల్లనే థాయిలాండ్ మీట్ నుంచి వైదొలగాల్సి వచ్చిందని దీపా కర్మాకర్ ట్వీట్ చేసింది. ఈ శస్త్ర చికిత్స కోసం ఆమె గతంలో భారత క్రికెట్ లెజెండ్ సచిన్ తెండూల్కర్‌కు చికిత్స చేసిన ప్రఖ్యాత వైద్యుడు అనంత్ జోషిని సంప్రదించినట్లు తెలుస్తోంది. 2014లో గ్లాస్గోలో జరిగిన కామనె్వల్త్ క్రీడల్లో కాంస్య పతకాన్ని గెలుచుకుని ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్టుగా వార్తల్లోకి ఎక్కిన దీపా కర్మాకర్ ఆ తర్వాత ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత జిమ్నాస్టుగా చరిత్రకెక్కడంతో పాటు రియో ఒలింపిక్ క్రీడల్లో తృటిలో పతకాన్ని చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.