క్రీడాభూమి

ఉజ్బెకిస్తాన్‌కు ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 4: డేవిస్ కప్ టెన్నిస్ ఆసియా/ఓషియానియా జోన్ గ్రూప్-1లో భారత్‌తో తలపడబోతున్న ఉజ్బెకిస్తాన్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మడమ గాయంతో బాధపడుతున్న టాప్ ఆటగాడు డెనిస్ ఇస్టోమిన్ మంగళవారం ఆ జట్టు నుంచి వైదొలిగాడు. ఎడమ కాలి మడమ గాయంతో బాధపడుతున్న ఇస్టోమిన్ భారత్‌తో పోరాడేందుకు తమతో కలసి బెంగళూరుకు రాలేదని, ఈ గాయం కారణంగా అతను కనీసం రెండు వారాల పాటు తమ జట్టుకు దూరంగా ఉంటాడని భావిస్తున్నామని ఉజ్బెకిస్తాన్ కెప్టెన్ పీటర్ లెబెద్ ఇక్కడ విలేఖరులకు తెలిపాడు.
డబుల్స్ జోడీని ఖరారు చేయలేదు : భూపతి
ఇదిలావుంటే, ఈ వారం చివర్లో ఉజ్బెకిస్తాన్‌తో తలపడే భారత డేవిస్ కప్ జట్టులో డబుల్స్ ఆటగాళ్లు ఎవరో వెల్లడించేందుకు కెప్టెన్ మషేష్ భూపతి నిరాకరించాడు. భారత జట్టులో డబుల్స్ ఆటగాళ్లు ఎవరన్నదీ ఇంకా ఖరారు చేయలేదని, అయినా ప్రస్తుతానికి ఈ అంశంపై కాకుండా ఉజ్బెకిస్తాన్‌పై అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించడంపైనే దృష్టి సారిస్తున్నామని భూపతి చెప్పాడు.