క్రీడాభూమి

ఫ్రాంచైజీలు ఇవే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1. గుజరాత్ లయన్స్, 2. రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్, 3. సన్‌రైజర్స్ హైదరాబాద్, 4. ముంబయి ఇండియన్స్, 5. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, 6. కోల్‌కతా నైట్ రైడర్స్, 7. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, 8. ఢిల్లీ డేర్ డెవిల్స్.
* కొచ్చి టస్కర్స్, పుణే వారియర్స్, డక్కన్ చార్జర్స్ ఫ్రాంచైజీలు వివిధ కారణాల వల్ల రద్దయ్యాయి.
* చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌పై రెండేళ్ల నిషేధం విధించడంతో, ఆ జట్ల స్థానంలో గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ జట్లు చేరాయి.
పరుగుల వరద
ఐపిఎల్‌లో పరుగుల వరద పారించిన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. 2013లో పుణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు ఐదు వికెట్లకు 263 పరుగులు సాధించి, టాప్ స్కోర్ జట్ల జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. 2016 టోర్నీలో గుజరాత్ లాయన్స్‌పై ఇదే జట్టు మూడు వికెట్లకు 248 పరుగులు చేసింది. 2010లో రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్లకు 246 పరుగులు సాధించి, ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. అంతకు ముందు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై ఇదే జట్టు 5 వికెట్లకు 240 చొప్పున పరుగులు చేసింది.
పూర్ షో
ఐపిఎల్ టోర్నీలో ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమై, అత్యల్ప స్కోరుకు ఆలౌటైన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. 2009లో ఈ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై కేవలం 58 పరుగులకే కుప్పకూలింది. 2008లో ముంబయి చేతిలో 67 పరుగులకు ఆలౌటైన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. 2014లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడిన రాయల్ చాలెంజర్స్ 70 పరుగులు మాత్రమే చేసింది. 2011లో డక్కన్ చార్జర్స్‌పై కొచ్చి టస్కర్స్ 74, ముంబయి ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 79 చొప్పున పరుగులు చేసి, అత్యల్ప స్కోర్ల జాబితాలో కొనసాగుతున్నాయి.