క్రీడాభూమి

డెవిల్స్‌కు మరో దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో ఎడిషన్ టి-20 టోర్నమెంట్ ప్రారంభం కావడానికి ముందే ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చికెన్ పాక్స్ (మసూచి) వ్యాధితో బాధపడుతున్న యువ స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ కనీసం వారం రోజుల పాటు డేర్‌డెవిల్స్ జట్టుకు దూరం కానున్నాడు. ప్రస్తుతం ముంబయిలోనే చికిత్స పొందుతున్న అయ్యర్ ఈ వ్యాధి నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాతే డేర్‌డెవిల్స్ జట్టులో చేరతాడని భావిస్తున్నారు. ఇందుకు కనీసం వారం రోజులైన పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డీకాక్, జెపి.డుమినితో పాటు ఏంజెలో మాథ్యూస్ (శ్రీలంక) లాంటి విదేశీ స్టార్ ఆటగాళ్లు దూరమైన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇప్పుడు వారం రోజుల పాటు అయ్యర్ సేవలను కూడా కోల్పోనుండటంతో ఆ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లయింది. నిరుడు జరిగిన ఐపిఎల్ తొమ్మిదో ఎడిషన్‌లో అయ్యర్ అంతగా రాణించలేకపోయినప్పటికీ అంతకుముందు ఎడిషన్‌లో అతను బ్యాట్‌తో మెరుపులు మెరిపించి డెవిల్స్‌కు ఎంతో దన్నుగా నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా 2016-17 సీజన్‌లో చక్కగా రాణించిన అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో సత్తా చాటుకోవడంతో పాటు రంజీ ట్రోఫీ సిరీస్‌లో ముంబయి జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో భారత టెస్టు జట్టులో అతనికి కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో తొలిసారి చోటు దక్కినప్పటికీ తుది జట్టులో అతనికి చోటు లభించని విషయం విదితమే.