క్రీడాభూమి

సన్‌రైజర్స్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రై జర్స్ హైదరాబాద్ బోణీ చేసింది. నిరుటి రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 40 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. బుధవా రం రాజీవ్ గాంధీ స్టేడియంలో పదో ఐపిఎల్ ప్రా రంభోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత జరిగి న మ్యాచ్‌లో నిరుటి ఫైనలిస్టు జట్లు ఢీకొన్నాయ. యువరాజ్ సింగ్, మోజెస్ హెన్రిక్స్ అర్ధ శతకాల తో రాణించడంతో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో నాలు గు వికెట్లకు 207 పరుగుల భారీ స్కోరు సాధించ గలిగింది. అనంతరం బెంగళూరు 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. సన్‌రైజర్స్ 35 పరు గుల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 19 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 14 పరుగులు చేసి, అనికేత్ చౌదరీ బౌలింగ్‌లో మన్దీప్ సింగ్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మోజెస్ హెన్రిక్స్‌తో కలిసి శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ రెండ వికెట్‌కు 8.5 ఓవర్లలో 74 పరుగులు జోడించారు. స్టువర్ట్ బిన్నీ బౌలింగ్‌లో సచిన్ బేబి క్యాచ్ పట్టగా ధావన్ అవుటయ్యాడు. అతను 31 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లతో 40 పరుగులు సాధించాడు. సెకెండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన యువరాజ్ సింగ్ చెలరేగిపోవడంతో, సన్‌రైజర్స్ స్కోరుబోర్డు పరుగులు తీసింది. 37 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 52 పరుగులు చేసిన మోజెన్ హ్రెనీని సచిన్ బేబి క్యాచ్ అందుకోగా యుజువేంద్ర చాహల్ అవుట్ చేశాడు. యువీ, హెన్రీ భాగస్వామ్యంలో 4.5 ఓవర్లలో 58 పరుగులు జత కలవడం విశేషం. కేవలం 27 బంతుల్లోనే, ఏడు ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో 62 పరుగులు చేసిన యువీని టైమల్ మిల్స్ క్లీన్ బౌల్డ్ చేయడంతో 190 పరుగుల స్కోరువద్ద సన్‌రైజర్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆతర్వాత దీపక్ హూడా (16), బెన్ కట్టింగ్ (16) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ స్కోరును 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 207 పరుగులకు చేర్చారు.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బెంగళూరు ఇన్నింగ్స్‌ను మన్దీప్ సింగ్, క్రిస్ గేల్ ఆరంభించారు. ఆశిష్ నెహ్రా వేసిన తొలి ఓవర్‌లో బెంగళూరు 11 పరుగులు రాబట్టి, పోటీ ఏ స్థాయలో ఉంటుందో చెప్పకనే చెప్పింది. భువ నేశ్వర్ కుమార్ మొదటి ఓవర్‌లో ఒక పరుగు మాత్రమే లభించగా, నెహ్రా వేసిన రెండో ఓవర్‌లో బెంగళూరు 16 పరుగులు కొల్లగొట్టింది. బలపడుతు న్న వీరి భాగస్వామ్యానికి అఫ్గనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ తెరదించాడు. అతని బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగిన మన్దీప్ 24 పరుగులు చేశాడు. మరో ఎనిమిది పరుగులకే గేల్ వికెట్ కూడా కూలింది. అతను 21 బంతు ల్లో 32 పరుగులు చేసి, డేవిడ్ వార్నర్ క్యాచ్ అందుకోగా దీపక్ హూడా బౌలింగ్‌లో అవుట య్యాడు. టి-20 ఫార్మాట్‌లో వార్నర్‌కు ఇది వం దో క్యాచ్ కావడం గమనార్హం. ట్రావిస్ హెడ్‌తో క లిసి స్కోరును ముందుకు తీసుకెళుతున్న కేదార్ జాదవ్ 31 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రనౌట య్యాడు. అప్పటికి బెంగళూరు స్కోరు 116 పరు గులు. 30 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్‌ను యువరాజ్ సింగ్ క్యాచ్ పట్టగా రషీద్ ఖాన్ అవు ట్ చేయడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. స్టు వర్ట్ బిన్నీ 11 పరుగులు చేసి, భు వనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో యువ రాజ్ సింగ్‌కు చిక్కాడు. చేయాల్సిన రన్‌రేట్ క్రమంగా పెరగడం బెంగ ళూరు ఆటగాళ్లపై ఒత్తిడిని పెంచింది. నెహ్రా రెండు వరుస బం తుల్లో షేన్ వాట్సన్ (22), శ్రీనాథ్ అరవింద్ (0) వికెట్లు కూల్చాడు. ఆరు పరుగులు చేసిన టైమల్ మిల్స్‌ను డేవిడ్ వార్నర్ క్యాచ్ పట్టగా భువనేశ్వర్ కు మార్ పెవిలియన్ పంపాడు. చివరి ఓవర్‌లో 43 పరుగులు అవసరం కా గా, బెన్ కట్టింగ్ వేసిన ఆ ఓవర్‌లో బెంళూరు ఏడు పరుగులు చేసి, యు జువేంద్ర చాహల్ (రనౌట్ 3) వికెట్ కోల్పోయంది. ఈ జట్టు 19.4 ఓవర్ల లో 172 పరుగులకు ఆలౌట్‌కాగా, స న్ రైజర్స్ 35 పరుగుల తేడాతో విజ యం సాధించింది. అన్ని విభాగాల్లో నూ రాణించిన సన్‌రైజర్స్ మొదటి నుంచి వ్యూహాత్మకంగా ఆడుతూ, ని రుటి విజయం అయాచితంగా రాలే దని నిరూపించింది.

* హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇంతకు ముందు వరకూ జరిగిన 15 మ్యాచ్‌ల్లో 12 పర్యాయాలు ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన వాట్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లక్ష్యాన్ని నిర్ణయించడం కంటే, ఛేదించడమే సులభమన్న అభిప్రాయంతో అతను బౌలింగ్‌ను ఎంచుకున్నాడు.
* ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు రాయల్ చాలెంజర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తొమ్మిది పర్యాయాలు ఢీకొన్నాయి. వాటిలో సన్‌రైజర్స్ 5 విజయాలను సాధించగా, బెంగళూరు 4 మ్యాచ్‌లను గెల్చుకుంది. నిరుడు ఈ రెండు జట్లు, ఫైనల్‌సహా మూడు మ్యాచ్‌ల్లో ఢీకొన్నాయి. సన్‌రైజర్స్ రెండు విజయాలను నమోదు చేసింది. బెంగళూరు ఒక మ్యాచ్‌ని తన ఖాతాలో వేసుకుంది.
* రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఏడు ఇన్నింగ్స్‌లో ఏడు అర్ధ శతకాలను సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సాధించాడు. కానీ ఈ మ్యాచ్‌లో 14 పరుగులకే అవుటయ్యాడు.

అట్టహాసంగా
పదో ఐపిఎల్ మొదలు

హైదరాబాద్, ఏప్రిల్ 5: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 సంబరం మరోసారి అభిమానులకు పసందైన విందును అందించడానికి ఉపక్రమించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో, పలువురు ప్రముఖుల సమక్షంలో పదో ఐపిఎల్ మొదలైంది. ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఐపిఎల్ టోర్నీల్లోనూ ఒకే ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగేది. అయితే, అభిమానులను ఎక్కువ సంఖ్యలో ఆకర్షించేందుకు వీలుగా, ఎనిమిది ఫ్రాంచైజీల హోం గ్రౌండ్స్‌లో వేరువేరుగా ప్రారంభోత్సవాలు జరుగుతాయి. వీటిలో మొదటిది హైదరాబాద్‌లో బుధవారం జరిగింది. సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రవి శాస్ర్తీ, వీరేందర్ సెవాగ్, వివిఎస్ లక్ష్మణ్ వంటి క్రికెట్ దిగ్గజాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఐపిఎల్ అప్పుడే పదో ఏట అడుగుపెట్టిందన్న విషయం ఆశ్చర్యం కలిగిస్తున్నదని సచిన్ వ్యాఖ్యానించాడు. ఏటేటా ఈ టోర్నీకి ఆదరణ పెరుగుతున్నదని అన్నాడు. కాగా, ప్రేక్షకులకు, అభిమానులకు ఆనందాన్ని పంచడానికే క్రికెట్ ఆడాలని సెవాగ్ అన్నాడు. ఐపిఎల్‌లో తాను కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు.
క్రికెట్ ప్రముఖులతో చిరు ఇంటర్వ్యూలు ముగిసిన తర్వాత, డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒక వాహనంలో, ఐపిఎల్ ట్రోఫీని తీసుకొచ్చాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి దానిని ప్రదర్శనగా ఉంచాడు. అనంతరం ఆటపాటలతో స్టేడియం హోరెత్తిపోయింది. ‘సారా జమానా.. హసీనోంకా దివానా’ పాటకు నటి అమీ జాక్సన్ చేసిన నృత్యం ఆహూతులను ఆకట్టుకుంది. మబ్బులు పట్టి, వాతావరణం కూడా ఆహ్లాదకరంగా మారడంతో, ప్రేక్షకుల ఆనందంతో కేరింతలు కొట్టారు. గాయం కారణంగా కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆడకపోవడంతో, అతని స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు నాయకత్వ బాధ్యతను షేన్ వాట్సన్ స్వీకరించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ వేయగా, దానిని గెలిచిన వాట్సన్ బౌలింగ్ ఎంచుకోకున్నాడు. మొత్తం మీద మాజీ దిగ్గజాల ఇంటర్వ్యూలతో మొదలైన ప్రారంభోత్సవ కార్యక్రమం టాస్‌తో ముగిసింది. ఆతర్వాత కొద్దిసేపటికే మ్యాచ్ మొదలైంది.
chitram....
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం జరిగిన
ఐపిఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చీర్ లీడర్ల నృత్యం