క్రీడాభూమి

విజ్‌డెన్ లీడింగ్ క్రికెటర్‌గా కోహ్లీ ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ‘క్రికెట్ బైబిల్’ విజ్‌డెన్ 2016 సంవత్సరానికి లీడింగ్ క్రికెటర్‌గా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎంపిక చేసింది. నిరుడు అతను టెస్టుల్లో 75.93 సగటుతో 1,215 పరుగులు సాధించాడు. 10 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడి, 92.37 సగటుతో 641 పరుగులు చేశాడు. టి-10 ఫార్మాట్‌లోనూ అద్భుతంగా రాణించి, సగటున 106.83 పరుగులు నమోదు చేశాడు. ఒక క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో కోహ్లీకి ఆరో స్థానం లభించింది. అయితే, సగటుల్లో అతని దరిదాపుల్లోనూ ఎవరూ లేకపోవడం విశేషం. కాగా, లీడింగ్ క్రికెటర్‌గా ఎంపికైన కోహ్లీ ఫొటో ఈఏడాది ఎడిషన్‌లో కవర్‌పేజీగా వస్తుంది. 2003లో రికీ పాంటింగ్ మొట్టమొదటిసారి ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా విజ్‌డెన్ ఈ అవార్డును ప్రకటిస్తున్నది. కోహ్లీ ఇటీవలే బిసిసిఐ నుంచి ‘పాలీ ఉమ్రీగర్’ అవార్డును స్వీకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విజ్‌డెన్ క్రికెటర్‌గా ఎంపికై మరో ఘనతను సాధించాడు.
మహిళల విభాగంలో లీడింగ్ క్రికెటర్‌గా ఎలిస్ పెర్రీ ఎంపికైంది. ఇక క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్‌గా మిస్బా ఉల్ హక్, యూనిస్ ఖాన్, బెన్ డంకెట్, రోలాండ్ జోన్స్, క్రిస్ వోగ్స్ ఎంపికయ్యారు.