క్రీడాభూమి

స్టోక్స్ గెలిపిస్తాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఏప్రిల్ 5: గతంలో రెండు పర్యాయాలు చాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్‌తో గురువారం పలపడుతున్న రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌కు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఎంత వరకూ అండగా నిలుస్తాడో, జట్టు విజయానికి ఎంత వరకూ కృషి చేస్తాడోనన్న ఉత్కంఠ అభిమానుల్లో క్షణక్షణానికీ పెరుగుతున్నది. ఈసారి వేలంలో అందరి కంటే ఎక్కువ మొత్తాన్ని అతనే దక్కించుకోవడంతో స్టార్ అట్రాక్షన్‌గా నిలిచాడు. పుణే అతనిని ఏకంగా 14.5 కోట్ల రూపాయలు వెచ్చించి కొన్నది. అన్ని ఫార్మాట్స్‌లోనూ రాణించే సత్తావున్న ఆల్‌రౌండర్‌గా పేరుతెచ్చుకున్న స్టోక్స్‌పై స్టీవెన్ స్మీత్ నాయకత్వంలోని పుణే ఎక్కువగా ఆధాపడిందన్నది వాస్తవం. ముంబయితో పోరు అతని సామర్థ్యానికి పరీక్షగా నిలవనుంది. ఇటీవల భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణానికి ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ప్రధాన కారకుడు. ఇరు జట్ల మధ్య ఘర్షణలు, వాగ్వాదాల సంఘటనలు పూర్తిగా మరుగున పడకముందే, ఐపిఎల్ టోర్నీ వచ్చేసింది. పుణే జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతను తన జట్టులోని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అజింక్య రహానే వంటి ఆటగాళ్లతో ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి. పుణే ఫ్రాంచైజీ ధోనీని తప్పించి, అతని స్థానంలో స్మిత్‌ను కెప్టెన్‌గా ఎందుకు ఎంపిక చేసిందో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదు. కాగా జట్టులో దక్షిణాఫ్రికా స్టార్ ఫఫ్ డు ప్లెసిస్ కూడా ఉన్నాడు. నిరుడు స్మిత్‌తోపాటు డు ప్లెసిస్ కూడా గాయం కారణంగా ఐపిఎల్‌కు దూరమయ్యాడు. అలాంటి పరిస్థితి మరోసారి తలెత్తకుండా వీరిద్దరూ జాగ్రత్త పడుతున్నారు.
ఇలావుంటే, నిరుటి ఎడిషన్‌లో 43.63 సగటుతో రహానే 480 పరుగులు సాధించాడు. అతని స్కోరులో ఆరు అర్ధ శతకాలున్నాయి. ఈసారి అతనిపై అభిమానుల అంచనాలు మరింతగా పెరిగాయన్నది నిజం. రెండేళ్ల సస్పెన్షన్‌కు గురైన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న ధోనీకి నిరుడు పుణే జట్టును నడిపించే అవకాశం దక్కింది. కానీ, ఇప్పుడు స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ధోనీ పాత్ర కేవలం ఒక ఆటగాడిగా మారిపోయింది. ఐపిఎల్‌లో అతను మొట్టమొదటిసారి కెప్టెన్సీ బాధ్యతలు లేకుండా ఆడనున్నాడు. గ్రేట్ ఫినిషర్‌గా పేరు సంపాదించిన అతను పుణేను ఐపిఎల్‌లో ఎంత వరకూ ఆదుకుంటాడన్నది ముంబయితో గురువారం జరిగే మ్యాచ్‌తో స్పష్టమవుతుంది. కాగా, స్మిత్, ధోనీ, రహానే తదితరులతో పుణే బ్యాటింగ్ విభాగంలో పటిష్టంగా ఉంది. అయితే, అశ్విన్, అశోక్ దిండా దూరంకావడంతో, బౌలింగ్ బలహీన పడడం కాయం.
ముంబయికే విజయావకాశాలు!
రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్‌కే గురువారం నాటి మ్యాచ్‌లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది నిపుణుల అభిప్రాయం. జొస్ బట్లర్, కీరన్ పొరాల్డ్ వంటి హార్డ్ హిట్టర్స్ ఈ జట్టు బ్యాటింగ్ బలాన్ని పెంచుతున్నారు. బౌలింగ్‌లో హర్భజన్ సింగ్ అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడనుంది. మిచెల్ జాన్సన్, లెడల్ సిమన్స్, లసిత్ మలింగ తదితరులు గురువారం జట్టుతో కలుస్తారు. నిరుడు ఐదో స్థానంతో సంతప్తృ చెందిన ముంబయి ఈసారి మెరుగైన స్థానం కోసం పోరాడనుంది.