క్రీడాభూమి

స్టీవెన్ స్మిత్ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఏప్రిల్ 6: ఐపిఎల్‌లో భాగంగా గురువారం ముం బయ ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ని రైజింగ్ పుణే సూపర్ జెయంట్స్ ఏడు వికెట్ల తేడాతో గెల్చుకుంది. స్టీవెన్ స్మిత్ అజే యంగా 84 పరుగులు చేసి, మరో బంతి మిగిలి ఉండగానే పుణే జట్టును విజయపథంలో నడిపించాడు. సొంత రాష్ట్రం లో ముంబయకి ఎదురుదెబ్బ తగిలింది.
టాస్ గెలిచిన పుణే ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యా టింగ్‌కు దిగిన ముంబయకి ఓపెనర్లు పార్థీవ్ పటేల్ (19), జొస్ బట్లర్ (38) బలమైన పునాది వేసే ప్రయత్నం చేశారు. కానీ, 45 పరుగుల స్కోరువద్ద పార్థీవ్ పటేల్ అవుట్‌కావడం తో మొదలైన వికెట్ల పతనం ఆతరావత నిరాటంగా కొనసా గింది. నితీష్ రాణా (34), కీరన్ పొలార్డ్ (27) కొంత వరకూ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయంది. అయతే, చివరి ఓవర్‌లో హార్దిక్ పాండ్య విజృంభణ ముంబ యని కొంత వరకూ ఆదుకుంది. అతను అశోక్ దిండా వేసిన ఇన్నింగ్స్ చివరి ఓ వర్‌లో 28 పరుగులు సాధించాడు. ఒక వైడ్, ఒక బై కూడా కలవడంతో ఆ ఓవర్‌లో ముంబయకి మొత్తం 30 పరుగులు లభించాయ. దీనితో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు ఆ జట్టు 184 పరుగులు చేయగలిగింది. హార్దిక్ పాండ్య 15 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లతో 35 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. పు ణే బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 28 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. ఈసారి ఐపిఎల్‌లో అత్యధిక ధరను సంపాదించిన బెన్ స్టోక్స్ 4 ఓవర్లలో 36 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు.
సాధారణమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ఆరం భించిన పుణే 35 పరుగుల స్కోరువద్ద మాయాంక్ అగర్వా ల్ వికెట్‌ను కోల్పోయంది. అతను 6 పరుగులు చేసి, మెక్ క్లీనగన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ అందుకోవడంతో అ వుటయ్యాడు. అనంతరం స్టీవెన్ స్మిత్, అజింక్య రహానే రెం డో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. 34 బంతులు ఎదు ర్కొని, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 60 పరుగులు చేసిన రహానేను నితీష్ రాణా క్యాచ్ పట్టగా టిమ్ సౌథీ అవుట్ చే శాడు. బెన్ స్టోక్స్ 21 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో సౌథీకి చిక్కాడు. 143 పరుగుల వద్ద పు ణే మూడో వికెట్ కోల్పోయంది. క్రీజ్‌లో నిలదొక్కుకున్న స్టీ వెన్ స్మిత్ ఆచితూచి ఆడుతుంటే, థర్డ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ డిఫెన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చాడు. మెక్‌క్లీనగన్, జస్‌ప్రీత్ బుమ్రా స్లాస్ ఓవర్లలో కొంత సేపు స్మి త్, ధోనీని నిలువరించారు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన బు మ్రా ఏడు పరుగులు ఇవ్వడంతో, చివరి ఓవర్‌లో పుణే విజ యానికి 13 పరుగుల దూరంలో నిలిచింది. కీరన్ పోలార్డ్ వేసిన ఆ ఓవర్ మొదటి బంతిలో ధోనీ సింగిల్ తీశాడు. రెం డో బంతిలో స్మిత్ కూడా సింగిల్‌తోనే సరిపుచ్చాడు. మూడో బంతిలో ధోనీ మరో సింగిల్ తీశాడు. నాలుగో బంతిని స్మిత్ సిక్సర్‌గా మార్చడంతో, చివరి రెండు బంతుల్లో పుణే నాలు గురు పరుగులు చేయాల్సి వచ్చింది. ఐదో బంతిలో మరో సిక్సర్ కొట్టి, పుణేను గెలిపించాడు. అతను మొత్తం 54 బం తులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 84 ప రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పుణే గెలిచే సమయాని కి స్మిత్‌తోపాటు ధోనీ (12) కూడా క్రీజ్‌లో ఉన్నాడు.