క్రీడాభూమి

పోరాటమే విజయ రహస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: చివరి వరకూ పోరాడడమే తన విజయ రహస్యమని ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లోనే 62 పరుగులు సాధించిన అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఈసారి ఐపిఎల్‌లో శుభారంభం చేయడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని యువీ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. జాతీయ జట్టులో మళ్లీ స్థానం దక్కిన తర్వాత, మరింత స్వేచ్ఛగా ఆడుతున్నానని అన్నాడు. క్యాన్సన్ బారిన పడిన తర్వాత కోలుకోవడానికి, తిరిగి అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టడానికి చాలా కష్టపడ్డానని అన్నాడు. ఒకానొక దశలో కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలని అనుకున్నానని, అయితే, కెప్టెన్ విరాట్ కోహ్లీ తనపై నమ్మకం ఉంచడంతో ఆ ఆలోచనను మానుకున్నానని తెలిపాడు. ‘ఒక ఆటగాడిపై కెప్టెన్‌కు నమ్మకం ఉంటే, డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరుల మద్దతు తప్పనిసరిగా లభిస్తుంది. నా విషయంలో అదే జరిగింది. చాలా సంక్లిష్టమైన కాలంలో ఎంతో మంది నాకు అండగా నిలిచారు. కోహ్లీతోపాటు సహచరులు కూడా సహకరించారు. అందుకే, నా కెరీర్‌లోనే అత్యధిక వనే్డ స్కోరును సాధించగలిగాను’ అన్నాడు.
జాతీయ జట్టుకు మళ్లీ ఎంపికైనప్పుడు వచ్చిన విమర్శలపై స్పందించాల్సిందిగా కోరినప్పుడు అసలు తాను వాటిని పట్టించుకోనని యువీ స్పష్టం చేశాడు. పత్రికలను చాలా తక్కువగా చదువుతానని, టీవీ కూడా చూడనని యువీ అన్నాడు. తన ఎంపిక సమయంలో వచ్చిన విమర్శ గురించి తనకు తెలియదని, ఒకవేళ తెలిసినా పట్టించుకునేవాడిని కానని అన్నాడు. తన దృష్టి మొత్తం ఆటపైనే కేంద్రీకృతమైందని చెప్పాడు. మరికొంత కాలం జాతీయ జట్టుకు సేవలు అందించే సామర్థ్యం ఉందంటూ కోహ్లీ ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాను మళ్లీ ఆటపై శ్రద్ధ పెట్టానని తెలిపాడు. 2011 వరల్డ్ కప్‌లో భాగంగా చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ శతకాన్ని నమోదు చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. దేశవాళీ పోటీల్లో బాగా ఆడగలిగానని, అందుకే, జాతీయ జట్టులోనూ రాణిస్తానన్న నమ్మకం పెరిగిందని చెప్పాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ధోనీ, తాను ఎక్కువగా మాట్లాడుకోలేదని అన్నాడు. ధోనీ కంటే తానే ముందుగా జాతీయ జట్టులోకి వచ్చానని, అతనితో కలిసి ఎన్నో మ్యాచ్‌లు ఆడానని తెలిపాడు. ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసునని, కాబట్టి వ్యూహాలు, ఇతరత్రా అంశాల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పాడు. జట్టులో సీనియర్ క్రికెటర్లుగా తమ బాధ్యతలను గుర్తించి, అవసరానికి తగినట్టు ఆడినట్టు యువీ తెలిపాడు. ఇంగ్లాండ్ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని, అందుకే, ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా ఆడామని తెలిపాడు.