క్రీడాభూమి

బెంగళూరు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 8: ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో శనివారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అసాధారణ ప్రతిభ కనబరచి, 15 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసి, ఎనిమిది వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసిన బెంగళూరు బౌలింగ్‌లో రాణించి, ఢిల్లీని తొమ్మిది వికెట్లకు 142 పరుగులకే కట్టడి చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు చేసింది. కేదార్ జాదవ్ అర్ధ శతకం (37 బంతులు/ 5 ఫోర్లు/ 5 సిక్సర్లు/ 69 పరుగులు)తో రాణించగా, కెప్టెన్ షేన్ వాట్సన్ 24 పరుగులు చేశాడు. మిగతా వారు పరుగులు రాబట్టంలో విఫలమయ్యారు.
కాగా, తక్కువ లక్ష్యాన్ని కూడా ఢిల్లీ ఛేదించలేకపోయంది. రిషభ్ పంత్ (36 బంతుల్లో 57) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోవడంతో, ఆ జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 142 పరుగులు చేయగలిగింది. స్టాన్‌లా క్, ఇక్బాల్ అబ్దుల్లా, చివరి ఓవర్‌ను అద్భుతంగా బౌల్ చేసిన పవన్ నేగి రెండేసి వికెట్లు తీశారు.