క్రీడాభూమి

నైట్ రైడర్స్‌కు ముంబయ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, ఏప్రిల్ 9: హాట్ ఫేవరిట్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరి గిన మ్యాచ్‌లో ముంబయ ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో విజ యం సాధించి సంచలనం సృష్టించింది. నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేయగా, ముంబయ మరో బంతి మిగిలి ఉం డగా, ఆరు వికెట్లను చేజార్చుకొని లక్ష్యాన్ని ఛేదించింది. చివరిలో హార్ది క్ పాండ్య 11 బంతుల్లో 26 పరుగులు చేసి ముంబయని గెలిపించాడు.
టాస్ గెలిచిన ముంబయ ఆహ్వానంతో మొదట బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయ 178 పరుగులు సాధించిం ది. మనీష్ పాండే 47 బంతులు ఎదుర్కొని, 5 ఫోర్లు, మరో 5 సిక్సర్ల సా యం తో 81 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. అతని పోరా టం తోనే నైట్‌రైడర్స్ గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. క్రిస్ లిన్ 32 పరు గులతో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కృణాల్ పాండ్య 24 పరుగులి చ్చి 3 వికెట్లు కూల్చాడు. మలింగ 36 పరుగులకు 2 వికెట్లు సాధించాడు.
ఈసారి ఐపిఎల్‌లో విజయాల ఖాతాను తెరవడానికి 179 పరుగులు చేయాల్సిన ముంబయకి ఓపెనర్లు పార్థీవ్ పటేల్, జొస్ బట్లర్ శుభారంభా న్నిచ్చే ప్రయత్నం చేశారు. మొదటి వికెట్‌కు 65 పరుగులు జోడించిన తర్వా త కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పార్థీవ్ ఎల్‌బి అయ్యాడు. అతను 27 బంతు ల్లో 30 పరుగులు చేశాడు. తర్వాత ఆరు పరుగులకే బట్లర్ వికెట్ కూలింది. అతను 22 బంతుల్లో 28 పరుగులు చేసి, అంకిత్ రాజ్‌పుత్ బౌలింగ్‌లో ఎల్ బిగా వెనుదిరిగాడు. రోహిత్ శర్మ (2), కృణాల్ పాండ్య (11), కీరన్ పొలార్డ్ (17) తక్కువ పరుగులకే అవుటైనప్పటికీ, నితీష్ రాణా ఒంటరి పోరాటంతో జట్టుకు విజయంపై ఆశలు పెంచాడు. 29 బంతుల్లో 50 పరుగులు సాధించి న అతనిని సునీల్ నారైన్ క్యాచ్ పట్టగా అంకిత్ రాజ్‌పుత్ అవుట్ చేశాడు. చి వరిలో హార్దిక్ పాండ్య విజృంభణ ముంబయని గెలిపించింది. చివరి వరకూ ఉత్కంఠను సృష్టించిన ఈ మ్యాచ్‌ని ముంబయ మరో బంతి మిగిలి ఉండ గా, నాలుగు వికెట్ల తేడాతో గెల్చుకొని నైట్ రైడర్స్‌కు షాకిచ్చింది.
కోల్‌కతా ఇంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తుచేయగా, ముంబయ ఏడు వికెట్ల తేడాతో రైజింగ్ పుణే సూపర్‌జెయంట్స్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆయా ఫలితాలు తారుమారయ్యాయ.