క్రీడాభూమి

డివిలియర్స్ శ్రమ వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, ఏప్రిల్ 10: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సోమవారం దాదాపు ఏకపక్షంగా సాగి న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఇంకా 33 బంతులు మిగిలి ఉండగానే, 8 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. బెంగళూ రు తరఫున క్రిస్ గేల్ స్థానంలో ప్లేయంగ్ ఎలె వన్‌లో చోటు సంపాదించిన డివిలియర్స్ చక్కటి ఆ టతో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇటీ వలే కాలికి శస్త్ర చికిత్స చేయంచుకున్న డివిలియర్స్ ఆతర్వాత మళ్లీ గాయపడడంతో ఐపిఎల్‌లో ఆడడం అనుమానంగా కనిపించింది. కానీ, అతను పట్టుద లతో మ్యాచ్‌లో రాణించాడు. అయతే, మిగతా వారి నుంచి సరైన సహకారం లభించకపోవడంతో, అత ను ప్రాతినిథ్యం వహించిన బెంగళూరు ఓడింది.
టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ షేన్ వాట్సన్ బ్యాటింగ్ ఎంచుకు న్నాడు. అయతే, ఓపెనర్‌గా వచ్చిన అతను ఒక పరుగు చేసి, మొదటి ఓవర్ చివరి బంతిలో అవుటయ్యాడు. మరో ఓపెనర్ విష్ణు వినోద్ (7), కేదార్ జాదవ్ (1) సమర్థంగా ఆడ లేకపోయారు. వికెట్లు కూలుతున్నప్పటికీ, క్రీజ్‌లో నిలదొక్కుకున్న ఎబి డివిలియర్స్ బెంగళూరును ఆ దుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేశాడు. మన్దీప్ సింగ్ 28 పరుగులు సాధించి, వరుణ్ ఆరో న్ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహాకు చిక్కగా, స్టువర్ట్ బిన్నీ (18 నాటౌట్)తో కలిసి మరో వికెట్ పడకుం డా జాగ్రత్త వహించిన డివిలియర్స్ 46 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. అతని స్కోరులో మూడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయ. పంజాబ్ బౌలర్ వరణ్ ఆరోన్ 21 పరుగులకు రెండు వికెట్లు పడగొ ట్టాడు. అక్షర్ పటేల్, సందీప్ శర్మ చెరొక వికెట్ త మతమ ఖాతాల్లో వేసుకున్నారు.
బెంగళూరును ఓడించేందుకు బ్యాటింగ్ ఆరం భించిన పంజాబ్ జట్టుకు మానన్ వోహ్రా, షహీం ఆ మ్లా చక్కటి ఆరంభాన్నిచ్చారు. 62 పరుగుల స్కో రు వద్ద టైమల్ మిల్స్ బౌలింగ్‌లో వోహ్రా ఎల్‌బిగా అవుటయ్యాడు. అతను 21 బంతుల్లో 34 పరుగు లు సాధించాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ కొ ట్టేసిన అక్షర్ పటేల్ తొమ్మిది పరుగులు చేసి, యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అ య్యాడు. తక్కువ వ్యవధిలో రెండు వికెట్లు కూలిన ప్పటికీ, లక్ష్యం చిన్నది కావడంతో పంజాబ్ ఆటగా ళ్లు ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. వ్యూహాత్మకంగా ఆడిన ఓపెనర్ హషీం ఆమ్లా 32 బంతుల్లో అర్ధ శత కాన్ని నమోదు చేశాడు. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్ కు వచ్చిన గ్లేన్ మాక్స్ కూడా చెలరేగిపోవడంతో, పంజాబ్ 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరింది. మాక్స్ వెల్ 22 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, నాలు గు సిక్సర్ల సాయంతో 43, ఆమ్లా 38 బంతుల్లో నా లుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 58 చొప్పున పరుగు లు చేసి నాటౌట్‌గా నిలిచారు. కేవలం రెండు వికెట్లు చేజార్చుకున్న పంజాబ్ ఎనిమిది వికెట్ల తేడాతో బెం గళూరును చిత్తుగా ఓడించింది. ఈసారి ఐపిఎల్‌లో నిరుటి రన్నరప్‌గా బరిలోకి దిగిన బెంగళూ రు మొదటి మ్యాచ్‌ని డిఫెం డింగ్ చాంపియన్ సన్‌రైజ ర్స్ హైదరాబాద్ చేతిలో 35 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిం దే. ఆతర్వాత పుంజుకొని, ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను 15 ప రుగుల తేడతో ఓడించి, గా డిలో పడినట్టు కనిపించింది. కానీ, మూడో మ్యాచ్‌లో మరో సారి ఓటమిని మూటగట్టుకుం ది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు హషీం ఆమ్లా అర్ధ శతకకం చేసినప్పటి కీ, డివిలియర్స్ హాఫ్ సెంచరీకే అభిమాను లు ఓటు వేస్తున్నారు. జట్టు క్లిష్టపరిస్థితుల్లో చి క్కుకొని, ప్రతి పరుగు కోసం అల్లాడుతున్న సమయంలో అతను ఆడిన తీరు అద్భుతం. మి గతా బ్యాట్స్‌మెన్ కూడా సహకరించి ఉంటే, పరి స్థితి మరోలా ఉండేది. కానీ, అంతా మూకుమ్మడి గా విఫలం కావడంతో బెంగళూరు 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేయ గలిగింది. ఈ సాధారణ లక్ష్యాన్ని ఛేదించడానికి పంజాబ్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపో యంది. ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది.

చిత్రం..రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాప్ స్కోరర్ ఎబి డివిలియర్స్
(46 బంతుల్లో 89 నాటౌట్)