క్రీడాభూమి

ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ దేవేంద్రోకు దక్కని చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడనున్న భారత జట్టులో దేవేంద్రో సింగ్‌కు చోటు దక్కలేదు. గతంలో రెండు పర్యాయాలు పతకాలను సాధించిన దేవేంద్రో ఈసారి పోటీలకు ప్రకటించిన జట్టులో లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. అయితే, భవిష్యత్ టోర్నీలు, పోటీలను దృష్టిలో ఉంచుకొని, యువ బాక్సర్లకు ప్రాధాన్యం ఇచ్చినట్టు బృందం ఎంపిక జరిగిన తీరు స్పష్టం చేస్తున్నది. కాగా, ఈ బృందంలో ప్రపంచ చాంపియన్‌షిప్స్ కాంస్య పతక విజేత శివ థాపా (60 కిలోలు), వికాస్ క్రిషన్ (75 కిలోలు), కామనె్వల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ మనోజ్ కుమార్ (69 కిలోలు) తదితరులు ఉన్నారు. ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ ఈనెల 30 నుంచి వచ్చేనెల 7వ తేదీ వరకు తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్)లో జరుగుతాయి.
జట్టు వివరాలు: అమిత్ పంఘల్ (49 కిలోల విభాగం), కవీందర్ సింగ్ (52 కిలోలు), గౌరవ్ బింధూరి (56 కిలోలు), శివ థాపా (60 కిలోలు), ఆశిష్ కుమార్ (64 కిలోలు), మనోజ్ కుమార్ (69 కిలోలు), వికాస్ క్రిషన్ (75 కిలోలు), మనీష్ పన్వర్ (81 కిలోలు), సుమీత్ సంగ్వాన్ (91 కిలోలు), సతీష్ కుమార్ (+91 కిలోల విభాగం).