క్రీడాభూమి

జడేజా వస్తున్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, ఏప్రిల్ 13: గాయం బారిన పడడంతో ఐపిఎల్ ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన రవీంద్ర జడేజా శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఆడతాడు. విరాట్ కోహ్లీ చేరికతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బలోపేతమైనట్టే, జడేజా రాకతో గుజరాత్ లయన్స్ ఆట తీరు మెరుగుపడే అవకాశాలున్నాయి. నిరుడు గ్రూప్ దశ మ్యాచ్‌లు పూర్తయ్యే సమయానికి టాపర్‌గా నిలిచిన గుజరాత్ ఈసారి ఇంత వరకూ రెండు మ్యాచ్‌లు ఆడి, రెంటిలోనూ పరాజయాలను మూటగట్టుకుంది. దీనితో శుక్రవారం రైజింగ్ పుణేతో జరిగే మ్యాచ్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. వరుసగా మూడోసారి ఓడితే, క్వాలిఫయర్ లేదా ఎలిమినేటర్‌కు చేరే అవకాశాలు సంక్లిష్టమవుతాయి. మూడు మ్యాచ్‌లు ఆడి, రెండు పరాజయాలను చవిచూసిన పుణేను కట్టడి చేయడం కష్టమేమీ కాదని, దీనికి తోడు జడేజా జట్టులో చేరితే విజయం సులభమవుతుందని గుజరాత్ ధీమాతో ఉంది. అల్‌రౌండర్‌గా జడేజా ఏ స్థాయిలో సేవలు అందిస్తాడో చూడాలి. గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ మధ్య మ్యాచ్ శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.