క్రీడాభూమి

ఒకే రోజు రెండు హ్యాట్రిక్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో శుక్రవారం ఒకేరోజు రెండు హ్యట్రిక్స్ నమో దయ్యాయ. తొలుత, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న వెస్టిండీస్ స్పిన్నర్ శామ్యూల్ బద్రీ ఐపిఎల్‌లో 15వ హ్యాట్రిక్‌ను నమోదు చేయగా, ఆతర్వాత గుజరాత్ లయన్స్ మీడియం పేసర్ ఆండ్రూ టై కూడా హ్యాట్రిక్ సాధించాడు. మొత్తం మీద హ్యాట్రిక్ చేసిన బౌలర్లలో బద్రీ 12 బౌలర్‌కాగా ఆండ్రూ టై 13వ బౌలర్. అమిత్ మిశ్రా మూడుసార్లు, యువరాజ్ సింగ్ రెండుసార్లు హ్యాట్రిక్ సాధించారు. ఐపిఎల్ టోర్నమెంట్‌లో ఈ విధంగా ఒక రోజే రెండు హ్యాట్రిక్స్ నమోదు కావడం ఇదే మొదటిసారి.
ఐపిఎల్‌లో హ్యాట్రిక్ వీరులు: 1. లక్ష్మీపతి బాలాజీ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్/ 2008లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై), 2. అమిత్ మిశ్రా (్ఢల్లీ డేర్‌డెవిల్స్/ 2008లో డక్కన్ చార్జర్స్‌పై, 2011లో డక్కన్ చార్జర్స్ తరఫున కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై, 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున పుణే వారియర్స్‌పై), 3. మఖయా ఎన్తినీ (చెన్నై సూపర్ కింగ్స్/ 2008లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై), 4. యువరాజ్ సింగ్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్/ 2009లో మొదట రాయల్ చాలెజర్స్‌పై ఆతర్వాత డక్కన్ చార్జర్స్‌పై), 5. రోహిత్ శర్మ (డక్కన్ చార్జర్స్/ 2009లో ముంబయి ఇండియన్స్‌పై), 6. ప్రవీణ్ కుమార్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు/ 2010లో రాజస్థాన్ రాయల్స్‌పై), 7. అజిత్ చండీలా (రాజస్థాన్ రాయల్స్/ 2012లో పుణే వారియర్స్‌పై), 8. సునీల్ నారైన్ (కోల్‌కతా నైట్ రైడర్స్/ 2013లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై), 9. ప్రవీణ్ తంబే (రాజస్థాన్ రాయల్స్/ 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై), 10. షేన్ వాట్సన్ (రాజస్థాన్ రాయల్స్/ 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై), 11. అక్షర్ పటేల్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్/ 2016లో గుజరాత్ లయన్స్‌పై), 12. శామ్యూల్ బద్రీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు/ 2017లో ముంబయి ఇండియన్స్‌పై), 13. ఆండ్రూ టై (గుజరాత్ లయన్స్/ 2017లో రైజింగ్ పుణే సూపర్‌జెయంట్స్‌పై).

చిత్రాలు..ముంబయ ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా హ్యాట్రిక్‌ను పూర్తి చేసిన బెంగళూరు స్పిన్నర్ శామ్యూల్ బ్రదీ
*హ్యాట్రిక్ సాధించిన గుజరాత్ లయన్స్ పేసర్ ఆండ్రూ టై ఆనందం. మొదటి సారి ఐపిఎల్ మ్యాచ్ ఆడి, ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా టై రికార్డు సృష్టించాడు