క్రీడాభూమి

సూపర్ పొలార్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 14: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ అర్ధ శతకంతో రాణించి ఆదుకోవడంతో, ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఢీకొన్న ముంబయి ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. బెంగళూరు స్పిన్నర్ శామ్యూల్ బద్రీ హ్యాట్రిక్ నమోదు చేయడం, ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భుజం గాయం నుంచి కోలుకొని హాఫ్ సెంచరీని నమోదు చేయడం శుభ పరిణామాలైనప్పటికీ ఆ జట్టును ఆదుకోలేకపోయాయి. కాగా, 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఇన్నింగ్స్‌ను ఆరంభించి, ఒకానొక దశలో ఏడు పరుగులకు నాలుగు, 33 పరుగుల వద్ద ఐదో వికెట్ కూడా కోల్పోయిన ముంబయిని పొలార్డ్ విజయం ముంగిట నిలిపాడు. కృణాల్ పాండ్య 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ముంబయిని గెలిపించాడు.
టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు క్రిస్ గేల్, కోహ్లీ తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించారు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపే ప్రయత్నం చేసే గేల్ అందుకు భిన్నంగా ఆడుతూ 27 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22 పరుగులు చేసి, హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. జట్టు స్కోరు 110 పరుగుల వద్ద కోహ్లీ వికెట్ కూలింది. భుజం గాయం కారణంగా మొదటి మూడు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయిన అతను 47 బంతుల్లో 62 పరుగులు చేసి, మిచెల్ మెక్‌క్లీనగన్ బౌలింగ్‌లో జొస్ బట్లర్‌కు దొరికిపోయాడు. కోహ్లీ స్కోరులో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అతని ఫిట్నెస్‌కుగానీ, ఫామ్‌కుగానీ ఎలాంటి సమస్య లేదని ఈ ఇన్నింగ్స్ రుజువు చేసింది. ఎబి డివిలియర్స్ 21 బంతుల్లో 19 పరుగులు చేసి కృణాల్ పాండ్య బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. కదార్ జాదవ్ (9), మన్దీప్ సింగ్ (0) తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. మొత్తం మీద బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు చేయగా, పవన్ నేగీ (13), స్టువర్ట్ బిన్నీ (6) క్రీజ్‌లో ఉన్నారు. ముంబయి బౌలర్లలో మెక్‌క్లీనగన్ 20 పరుగులకు రెండు వికెట్లు సాధిండు. హ్యార్దిక్, కృణాల్ చెరొక వికెట్ పడగొట్టారు.
టాప్ ఆర్డర్ విఫలం
బెంగళూరును ఆ జట్టు హోం గ్రౌండ్‌లోనే ఓడించడానికి 143 పరుగులు సాధించాల్సి ఉండగా, టాప్ ఆర్డర్ విఫలం కావడం, బద్రీ హ్యాట్రిక్ నమోదు చేయడం ముంబయిని కష్టాల్లో పడేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే జొస్ బట్లర్‌ను, గేల్ క్యాచ్ పట్టగా స్టువర్ట్ బిన్నీ అవుట్ చేశాడు. తర్వాతి ఓవర్‌లో బద్రీ వరుస బంతుల్లో పార్థీవ్ పటేల్ (3), మెక్‌క్లీనగన్ (0), రోహిత్ శర్మ (0) వికెట్లను పడగొట్టాడు. దీనితో ఏడు పరుగులకే ముంబయి నాలుగు వికెట్లు చేజార్చుకొని, సమస్యల్లో కూరుకుపోయింది. చక్కటి ఫామ్‌లో ఉన్న నితీష్ రాణా 11 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద బద్రీ బౌలింగ్‌లోనే మన్దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో, ముంబయి 33 పరుగుల వద్ద ఐదో వికెట్ చేజార్చుకుంది. ఈ స్థితిలో జట్టును ఆదుకునే బాధ్యతను పొలార్డ్‌తో కలిసి కృణాల్ తన భుజాలపైకి ఎత్తుకున్నాడు. వీరు ఆరో వికెట్‌కు 93 పరుగులు జోడించి, ముంబయిని విజయానికి చేరు చేశారు. 47 బంతులు ఎదుర్కొన్న పొలార్డ్ మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 70 పరుగులు చేసి, యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో డివిలియర్స్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. చివరిలో తన సోదరుడు హార్దిక్ (4 బంతుల్లో 9)తో కలిసి కృణాల్ (30 బంతుల్లో 37) మరో వికెట్ కూలకుండా ముంబయిని గెలిపించాడు. 18.5 ఓవర్లలో ఆరు వికెట్లకు 143 పరుగులు చేసిన ముంబయి ఇంకా ఏడు బంతులు మిగిలి ఉండగానే, నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ జట్టుకు ఇది మూడో విజయంకాగా, బెంగళూరుకు మూడో పరాజయం. కాగా, పాయంట్ల పట్టికలో ముంబయ అగ్రస్థానంలో కొనసాగుతున్నది.

* రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చివరి 32 బంతుల్లో ఒక్క బౌండరీని కూడా సాధించలేకపో యంది. కోహ్లీ అవుటైన తర్వాత ఆ జట్టు పరిస్థితి ఏ విధంగా తల్లకిందులైందో చెప్పడా నికి ఇదో ఉదాహరణ.
* ఐపిఎల్‌లో ఎబి డివిలియర్స్‌ను కృణాల్ పాండ్య అవుట్ చేయడం ఇది మూడోసారి. అతను డివిలియర్స్‌కు మొత్తం 21 బంతులు వేసి, 17 పరుగులిచ్చి, మూడు పర్యాయాలు పెవిలియన్‌కు పంపాడు.
* ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయ ఇండియన్స్ తరఫున ఇద్దరు వెస్టిండీస్ ఆటగాళ్లే రాణించడం, మ్యాచ్‌ని అత్యంత ఉత్కంఠ భరితంగా మార్చడం విశేషం. బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న స్పిన్నర్ శామ్యూల్ బద్రీ హ్యాట్రిక్ నమోదు చేయగా, ముంబయ ఇండియన్స్‌కు అండగా నిలిచిన కీరన్ పొలార్డ్ ఆ జట్టును గెలిపించాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
* భుజం గాయం నుంచి కోలుకున్న బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేశాడు. 62 పరుగులు చేసిన అతను బెంగళూరు టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
* నిరుడు ఫైనల్ వరకూ చేరి, టైటిల్ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన బెంగళూరు ఈసారి రన్నరప్‌గా బరిలోకి దిగింది. అయతే, ఆ స్థాయ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోతున్నది. ఇప్పటి వరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు మూడు పరాజయాలను మూటగట్టుకుంది.
* ఈ మ్యాచ్ ఒక్కోసారి ఒక్కో జట్టుకు అనుకూలంగా మారుతూ ఉత్కంఠ రేపింది. ముంబయ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొన్న గేల్, కోహ్లీ పరుగులను కొల్లగొడుతున్నప్పుడు మ్యాచ్ బెంగళూరుకు అనుకూలంగా మారింది. అయతే, చివరిలో బెంగళూరు బ్యాట్స్‌మెన్ పరుగుల వేట కొనసాగించలేకపోవడంతో ముంబయది పైచేయగా మారింది. స్పిన్నర్ శామ్యూల్ బద్రీ హ్యట్రిక్ సాయంతో, 9 పరుగులకే నాలుగు వికెట్లు కూల్చడంతో బెంగళూరు తిరిగి ఆధిపత్యాన్ని సంపాదించింది. కానీ కీరన్ పొలార్డ్ 47 బంతుల్లో 70 పరుగులు సాధించి, మ్యాచ్‌ని ముంబయకి అనుకూలంగా మార్చాడు.
*ఐపిఎల్ చరిత్రలో పది కంటే తక్కువ పరుగులకే 4 వికెట్లు కోల్పోయనప్పటికీ ఆతర్వాత కోలుకొని విజయం సాధించిన తొలి జట్టుగా ముంబయ రికార్డు సృష్టించింది.

సంక్షిప్త స్కోర్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 20 ఓవర్లలో 5 వికెట్లకు 142 (క్రిస్ గేల్ 22, విరాట్ కోహ్లీ 62, ఎబి డివిలియర్స్ 19, మిచెల్ మెక్‌క్లీనగన్ 2/20, హార్దిక్ పాండ్య 1/9, కృణాల్ పాండ్య 1/21).
ముంబయి ఇండియన్స్: 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 145 (కీరన్ పొలార్డ్ 70, కృణాల్ పాండ్య 37 నాటౌట్, శామ్యూల్ బధ్రీ 4/9, స్టువర్ట్ బిన్నీ 1/14, యుజువేంద్ర చాహల్ 1/31).

చిత్రం..కీరన్ పొలార్డ్
(47 బంతుల్లో 70 పరుగులు)