క్రీడాభూమి

మాంటెకార్లొ టెన్నిస్ నాదల్‌కు టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొనాకో, ఏప్రిల్ 23: మాంటెకార్లొ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రాఫెల్ నాదల్ గెల్చుకున్నాడు. ఫైనల్‌లో అతను అల్‌బర్ట్ రమోస్ వినోలస్‌ను 6-1, 6-3 తేడాతో చిత్తుచేశాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ప్రత్యర్థిపై విరుచుకుపడిన ‘స్పెయిన్ బుల్’ నాదల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయా విజయాన్ని సాధించాడు.
డబుల్స్‌లో నెగ్గిన బొపన్న
పురుషుల డబుల్స్ విభాగంలో భారత ఆటగాడు రోహన్ బొపన్న టైటిల్ సాధించాడు. ఉరుగ్వేకు చెందిన పాబ్లో క్యువాస్‌తో కలిసి బరిలోకి దిగిన అతను ఫైనల్‌లో ఫెలిసియానో లొపెజ్, మార్క్ లొపెజ్ జోడీని 6-3, 3-6, 10-4 తేడాతో ఓడించాడు. ఈ సీజన్‌లో బొపన్నకు ఇది రెండో టైటిల్. ఇంతకు ముందు అతను జీవన్ నెడుంజెనియన్‌తో కలిసి చైనీస్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్‌లో విజేతగా నిలిచాడు.