క్రీడాభూమి

గర్ల్‌ఫ్రెండ్ ఎరికాతో మెక్‌రొయ్ పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాజిల్‌టౌన్, ఏప్రిల్ 23: ఎంపిక చేసిన అతి కొద్ది మంది ఆహ్వానితుల మధ్య ప్రపంచ మేటి గోల్ఫర్ రొరీ మెక్‌రొయ్ వివాహం తన గర్ల్‌ఫ్రెండ్ ఎరికా స్టోల్‌తో జరిగింది. ఆహూతుల సంఖ్య రెండు వందలకు మించలేదని సమాచారం. ప్రచారానికి దూరంగా పెళ్లి జరగాలని వధూవరులు నిర్ణయించుకోవడంతో మీడియాను కూడా ఆహ్వానించలేదు. కాజిల్‌టౌన్ (ఐర్లాండ్)లోని ఆష్‌ఫోర్ట్ కాజిల్‌లో జరిగిన ఈ పెళ్లికి గోల్ఫర్లు సెర్గియో గార్సియా, పాల్ మెక్‌గినే్ల, మార్టిన్ కేమర్, షేన్ లోరీ, మెక్‌రొయ్ సన్నిహితుడు, ‘వన్ డైరెక్షన్’ స్టార్ నియాల్ హొరాన్ తదితరులు హాజరయ్యారు. పాప్ స్టార్ ఎడ్ షీరన్ ముందుగా కుదుర్చుకున్న కాంట్రాక్టులను పూర్తి చేయాల్సిన కారణంగా వివాహానికి రాలేకపోయాడు.