క్రీడాభూమి

నైట్‌రైడర్స్‌కు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, మే 9: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) పదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ప్రమాదంలో పడింది. ప్లే-ఆఫ్ బెర్తు కోసం రేసులో ఉన్న ఆ జట్టు మంగళవారం మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (పిసిఎఎస్)లో జరిగిన కీలక లీగ్ మ్యాచ్‌లో గెలుపు ముంగిట బొక్కబోర్లా పడటమే ఇందుకు కారణం. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (పిసిఎఎస్) స్టేడియంలో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 14 తేడాతో విజయం సాధించి నైట్‌రైడర్స్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు సాధించగా, కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టపోయి 153 పరుగులకే పరిమితమైంది. ప్రస్తుత సీజన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు 13 మ్యాచ్‌లలో ఇది ఐదో ఓటమి కాగా, కింగ్స్ ఎలెవెన్‌కు 12 మ్యాచ్‌లలో ఇది ఆరో విజయం.
అంతకుముందు టాస్ గెలిచిన నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవెన్ జట్టులో మనన్ వోహ్రా కొద్దిసేపు దూకుడుగా ఆడి 16 బంతుల్లో 25 పరుగులు సాధించి వెనుదిరగ్గా, ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ 12 పరుగులకు, ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్ 12 పరుగులకు నిష్క్రమించారు. దీంతో కింగ్స్ ఎలెవెన్ 56 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (33 బంతుల్లో 38), కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (25 బంతుల్లో 44) స్థిమితంగా ఆడి 71 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరి నిష్క్రమణ తర్వాత స్వప్నిల్ సింగ్ (2)ను క్రిస్ వోక్స్ క్లీన్‌బౌల్డ్ చేయగా, అక్షర్ పటేల్ (10 బంతుల్లో 8), రాహుల్ తెవాతియా (8 బంతుల్లో 15) అజేయంగా నిలిచారు. దీంతో కింగ్స్ ఎలెవెన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు సాధించింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో క్రిస్ వోక్స్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు కైవసం చేసుకోగా, ఉమేష్ యాదవ్, సునీల్ నరైన్ ఒక్కో వికెట్ అందుకున్నారు.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో ఓపెనర్ సునీల్ నరైన్ (10 బంతుల్లో 18)తో పాటు కెప్టెన్ గౌతమ్ గంభీర్ (18 బంతుల్లో 8), వికెట్‌కీపర్ రాబిన్ ఉతప్ప (0) త్వరత్వరగా నిష్క్రమించినప్పటికీ నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ క్రిస్ లిన్ క్రీజ్‌లో నిలదొక్కుకుని ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ప్రతిఘటించాడు. మనీష్ పాండే (23 బంతుల్లో 18) అందించిన సహకారాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని 29 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్న అతను మొత్తం మీద 52 బంతుల్లో 84 పరుగులు సాధించి రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే అతని స్థానంలో వచ్చిన యూసుఫ్ పఠాన్ 3 బంతుల్లో కేవలం 2 పరుగులకే నిష్క్రమించడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 139 పరుగుల స్కోరు వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కొలిన్ డీ గ్రాండ్‌హోమ్ (7 బంతుల్లో 11), క్రిస్ వోక్స్ (3 బంతుల్లో 2) అజేయంగా నిలిచినప్పటికీ అప్పటికే పరుగుల వేటలో వెనుకబడిన నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులకే చేతులెత్తేసింది.కింగ్స్ ఎలెవెన్ బౌలర్లలో రాహుల్ తెవాతియా, మొహిత్ శర్మ రెండేసి వికెట్లు కైవసం చేసుకోగా, మ్యాట్ హెన్రీ ఒక వికెట్ రాబట్టుకున్నాడు.

సంక్షిప్తంగా స్కోర్లు
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 167/6 (గ్లెన్ మ్యాక్స్‌వెల్ 44, వృద్ధిమాన్ సాహా 38, మనన్ వోహ్రా 25, రాహుల్ తెవాతియా 15-నాటౌట్, మార్టిన్ గుప్టిల్ 12, షాన్ మార్ష్ 11, అక్షర్ పటేల్ 8-నాటౌట్, స్వప్నిల్ సింగ్ 2, ఎక్స్‌ట్రాలు: 12).
బౌలింగ్: క్రిస్ వోక్స్ 2/20, కుల్దీప్ యాదవ్ 2/34, ఉమేష్ యాదవ్ 1/26, సునీల్ నరైన్ 1/27.
వికెట్ల పతనం: 1-39, 2-41, 3-56, 4-127, 5-146, 6-149.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 153/6 (క్రిస్ లిన్ 84, సునీల్ నరైన్ 18, మనీష్ పాండే 18, కొలిన్ డీ గ్రాండ్‌హోమ్ 11-నాటౌట్, గౌతమ్ గంభీర్ 8, క్రిస్ వోక్స్ 8-నాటౌట్, యూసుఫ్ పఠాన్ 2, ఎక్స్‌ట్రాలు: 4).
బౌలింగ్: రాహుల్ తెవాతియా 2/18, మొహిత్ శర్మ 2/24, మ్యాట్ హెన్రీ 1/31.
వికెట్ల పతనం: 1-39, 2-78, 3-79, 4-131, 5-132, 6-139.
*
=== ఐపిఎల్-10లో నేడు ===
గుజరాత్ లయన్స్
ఢిల్లీ డేర్‌డెవిల్స్

చిత్రం..క్రిస్ లిన్ పోరాటం వృథా