క్రీడాభూమి

ఆధిపత్య పోరులో ముంబయ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 13: పదో ఐపిఎల్ గ్రూప్ దశలో అగ్రస్థానం కోసం ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబ యి ఇండియన్స్ చక్కటి ఆటతో కోల్‌కతా నైట్ రైడ ర్స్‌ను తొమ్మిది పరుగుల తేడాతో ఓడించింది. ఈ జట్టు 14 మ్యాచ్‌ల్లో పదో విజయాన్ని నమోదు చేసి 20 పాయంట్లతో నంబర్ వన్ స్థానాన్ని పదిలం చే సుకుంది. నైట్ రైడర్స్‌కు ఇది ఆరో పరాజయం. మొ త్తం మీద ఈ జట్టు 16 పాయంట్లు సంపాదించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 17 పాయంట్లతో నైట్ రైడ ర్స్‌ను అధిగమించి రెండో స్థానాన్ని చేరింది. మొద ట బ్యాటింగ్ చేసిన ముంబయ 20 ఓవర్లలో 5 వికె ట్లకు 173 పరుగులు చేయగా, నైట్ రైడర్స్ 20 ఓవ ర్లలో 8 వికెట్లకు 164 పరుగులకు పరిమితమైంది.
లక్ష్యాన్ని నెలకొల్పడం కంటే ఛేదించడమే సులభంగా తోచిన నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సౌరభ్ తివారీతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన లెండల్ సిమన్స్ పరుగుల ఖాతా తెరవకుండానే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో సునీల్ నారైన్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతూ, ఓపెనర్ సౌరభ్ తివారీకి అండగా నిలిచాడు. జట్టు స్కోరు 69 పరుగుల వద్ద అతని వికెట్ కూలింది. 21 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 27 పరుగులు చేసిన రోహిత్‌ను అంకిత్ రాజ్‌పుత్ ఎల్‌బిగా అవుట్ చేశాడు. నైట్ రైడర్స్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని, 43 బంతుల్లో 52 పరుగులు చేసిన సౌరభ్ తివారీ జట్టు స్కోరు 130 పరుగుల వద్ద రనౌటయ్యాడు. సకాలంలో క్రీజ్‌లో చేరుకోలేకపోయిన అతను ఉమేష్ యాదవ్ నేరుగా స్టంప్స్‌ను పడగొట్టడంతో పెవిలియన్ చేరాడు. మరో హాఫ్ సెంచరీ వీరుడు అంబటి రాయుడు కేవలం 37 బంతుల్లోనే 63 పరుగులు సాధించాడు. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగిన అతను కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో షాట్ కొట్టేందుకు ప్రయత్నించి, వికెట్‌కీపర్ రాబిన్ ఉతప్ప స్టంప్ చేయడంతో వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ ముగిసేందుకు మరో రెండు బంతులు మిలిగి ఉండగా కీరన్ పొలార్డ్ (13)ను యూసుఫ్ పఠాన్ క్యాచ్ పట్టగా ట్రెంట్ బౌల్ట్ పెవిలియన్‌కు పంపాడు. చివరిలో హార్దిక్ పాండ్య (1), కృణాల్ పాండ్య (0) క్రీజ్‌లో నిలవగా, ముంబయి 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ట్రెంట్ బౌల్ట్ 30 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు. కుల్దీప్ యాదవ్, అంకిత్ రాజ్‌పుత్ చెరొక వికెట్ సంపాదించారు.
మొదటి ఓవర్‌లోనే వికెట్
ముంబయి ఇండియన్స్‌ను ఓడించడం ద్వారా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించడానికి 174 పరుగులు చేయాల్సిన నైట్ రైడర్స్ మొదటి ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది. టిమ్ సౌథీ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య క్యాచ్ అందుకోగా సునీల్ నారైన్ డకౌటయ్యాడు. జట్టు స్కోరు 41 పరుగులకు చేరుకున్నప్పుడు కెప్టెన్ గౌతం గంభీర్ వికెట్ కూలింది. అతను 16 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 21 పరుగులు చేసి, మిచెల్ జాన్సన్ బౌలింగ్‌లో కర్న్ శర్మ క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు. హార్డ్ హిట్టర్ రాబిన్ ఉతప్ప ఈ మ్యాచ్‌లో కేవలం రెండు పరుగులకే పరిమితమయ్యాడు. కర్న్ శర్మ బౌలింగ్‌లో అతను రోహిత్ శర్మకు దొరికిపోయాడు. అప్పుడు నైట్ రైడర్స్ స్కోరు 53 పరుగులు. ఆదనంగా ఒక్క పరుగు కూడా జత కలవక ముందే ఓపెనర్ క్రిస్ లిన్ అవుటయ్యాడు. అతను 14 బంతులు ఎదుర్కొని, 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. వినయ్ కుమార్ బౌలింగ్‌లో కృణాల్ పాండ్య క్యాచ్ పట్ట డంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. యూసుఫ్ పఠాన్ జట్టును ఆదుకునే రీతిలో ఆడాడు. కానీ, అతను 20 పరుగుల వద్ద ఆడుతున్నప్పుడు వినయ్ కుమార్ బౌలింగ్లోనే హార్దిక్ పాండ్య చక్కటి క్యాచ్ అందుకొని అతనికి పెవిలియన్ దారి చూపాడు. వి కెట్లు కూలుతున్నప్పటికీ, పనీష్ పాండే, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ నైట్ రైడర్స్ స్కోరుబోర్డు వేగాన్ని పెంచారు. హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో తడబడిన కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (29 పరుగులు) బౌల్డ్ కా వడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. మనీష్ పాండే 33 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు సుచి త్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. చివరి రెండు ఓవర్లలో నైట్ రైడర్స్ విజయానికి 21 పరుగుల దూరంలో నిలిచింది. 19వ ఓవర్ వేసిన టిమ్ సౌథీ 7 పరుగులిచ్చి కుల్దీప్ యాదవ్ (16) వికెట్ కూల్చా డు. చివరి ఓవర్‌లో 14 పరుగులు చేయాల్సిన నైట్ రైడర్స్‌ను అడ్డుకునే బాధ్యతను హార్దిక్ పాండ్య తీ సుకున్నాడు. అతను చివరి ఓవర్‌లో 4 పరుగులి చ్చాడు. దీనితో నైట్ రైడర్స్ 9 ప రుగుల తేడాతో ఓటమిపాలైంది. అప్పటికి ట్రెంట్ బౌల్ట్ 5, ఉమేష్ యాదవ్ 4 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ముంబయ బౌలర్లలోసౌథీ, వినయ్ కుమార్, హార్దిక్ పాండ్య రెండేసి వికెట్లు సాధించారు.