క్రీడాభూమి

చెల్సియాను గెలిపించిన బషోయ్ సూపర్ గోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెస్ట్ బ్రోమ్‌విచ్ (యునైటెడ్ కింగ్‌డమ్), మే 13: ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను చెల్సియా కైవసం చేసుకుంది. సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన మిచీ బషోయ్ కీలక గోల్ చేసి, చెల్సియాను గెలిపించడం విశేషం. వెస్ట్ బ్రోమ్‌తో జరిగిన ఫైనల్‌లో చెల్సియా మితిమీరిన జాగ్రత్తలు తీసుకుంది. గోల్స్ కోసం ప్రయత్నించకుండా రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. వెస్ట్ బ్రోమ్ కూడా అదే వూహ్యానికి ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్న రీతిలోనే ద్వితీయార్ధంలోనూ ఇరు జట్ల డిఫెన్స్ ప్లే కొనసాగింది. మ్యాచ్ నిర్ణీత సమయంలో గోల్స్ నమోదయ్యే అవకాశాలు కనిపించడం లేదని ప్రేక్షకులంతా దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ దశలో డిగో కోస్టాకు సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన బషోయ్ ఎవరూ ఊహించని రీతిలో బంతిపై ఆధిపత్యాన్ని సాధించాడు. వెస్ట్ బ్రోమ్ రక్షణ వలయాన్ని ఛేదిస్తూ, 82వ నిమిషంలో గోల్ చేశాడు. అతను గ్రౌండ్‌లో కేవలం ఎనిమిది నిమిషాలే ఉన్నప్పటికీ, మ్యాచ్‌పై తన ప్రభావం చూపాడు. అతను చేసిన గోల్‌తోనే చెల్సియా ఫైనల్‌లో గెలిచి, ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను అందుకుంది.

చిత్రం..మిచీ బషోయ్