క్రీడాభూమి

సిఎతో రాజీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, మే 14: క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఇటీవల ప్రకటించిన కాంట్రాక్టు పేర్కొన్న మొత్తాలు ఆమోదయోగ్యంగా లేవంటూ విమర్శలు గుప్పిస్తున్న క్రికెటర్ల సంఘం (ఎసిఎ) రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంట్రాక్టుపై సంతకాలు చేయడానికి ఆస్ట్రేలియా క్రికెటర్లు నిరాకరించగా, సహనం కోల్పోయిన సిఎ అధికారులు వచ్చే నెల నుంచి కాంట్రాక్టు చెల్లింపులను నిలిపివేస్తామని హెచ్చరించారు. దీనితో కంగుతిన్న ఎసిఎ రాజీ యత్నాలు ఆరంభించింది. ఆదివారం సిఎ అధికారులను కలిసిన ఎసిఎ ప్రతినిధులు తమ వాదనను విరమించారు. జీతాలు చెల్లించేది లేదంటూ హెచ్చరించడం మంచిది కాదని, సామరస్య ధోరణిని అవలంభించాలని సూచించారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, ఎసిఎకు సిఎ అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వలేదని సమాచారం. త్వరలోనే సమావేశమై చర్చించిన తర్వాతే ఎసిఎ ప్రతినిధులతో సిఎ అధికారులు ప్రతిపాదనలు చేసే అవకాశాలున్నాయి. ఇలావుంటే, కొంత మంది ఆటగాళ్లు కాంట్రాక్టుపై సంతకానికి ససేమిరా అంటున్నట్టు తెలుస్తున్నది.