క్రీడాభూమి

స్వర్ణం సాధించిన భజరంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: ఇక్కడ జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పురుషుల 65 కిలోల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో భజరంగ్ పునియా స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్‌లో అతను కొరియాకు చెందిన సెన్‌గుయ్ లీని 6-2 పాయింట్ల తేడాతో ఓడించాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకూ భారత్‌కు ఇదే మొదటి స్వర్ణం. కాగా, టైటిల్ రేసులో ఉన్న సరిత ఫైనల్‌లో ఓటమిపాలైంది. మహిళల 58 కిలోల విభాగంలో ఆమె అలసులూ టినిబెకొవా (కిర్గిస్థాన్) చేతిలో 0-6 తేడాతో చిత్తయింది. కాగా, పురుషుల 125 కిలోల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో భారత రెజ్లర్ సుమీత్ సంగ్వాన్ ఫైనల్ చేరాడు. సెమీస్‌లో అతను ఫర్ఖూద్ అనకులొవ్ (తజకిస్థాన్)ను 7-2 తేడాతో ఓడించాడు. టైటిల్ కోసం అతను ఇరాన్‌కు చెందిన యడొలా మొహమ్మద్‌కజెమ్ మొహెబీతో తలపడతాడు. ఇలావుంటే, హర్ఫూల్ (61 కిలోలు), వినోద్ కుమార్ ఓం ప్రకాశ్ (70 కిలోలు), సోమ్‌వీర్ (86 కిలోలు) తమతమ మొదటి రౌండ్ ఫైట్స్‌లోనే పరాజయాలను ఎదుర్కొన్నారు.