క్రీడాభూమి

చాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మే 14: చాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) పెంచింది. గతంలో ఈ మొత్తం 4 మిలియన్ డాలర్లుకాగా, దానికి మరో ఐదు లక్షల డాలర్లను చేర్చి, 4.5 మిలియన్లుగా ఖాయం చేసింది. ఇంగ్లాండ్‌లోని కార్డ్ఫి వేల్స్, ఎడ్జిబాస్టన్, ది ఓవల్ స్టేడియాల్లో జూన్ 1 నుంచి 18 వరకు జరిగే చాంపియన్స్ ట్రోఫీలో విజేత జట్టుకు 2.2 మిలియన్ డాలర్లు లభిస్తాయి. రన్నరప్ జట్టు 1.1 మిలియన్ డాలర్ల చెక్కును తీసుకుంటుంది. సెమీస్‌లో ఓడిన రెండు జట్లకు చెరి 4,50,000 డాలర్లు దక్కుతాయి. ప్రతి గ్రూపులో మూడో స్థానంలో ఉన్న జట్లు తలా 90,000 డాలర్లు సంపాదించుకుంటాయి. అదే విధంగా గ్రూప్స్‌లో చివరి స్థానంలో ఉన్న జట్లకు చెరి 60,000 డాలర్లు లభిస్తాయి.