క్రీడాభూమి

ఆసియా అథ్లెటిక్స్‌లో భారత్‌కు మూడో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, మే 23: ఆసియా యూత్ అథ్లెటిక్స్ రెండో ఎడిషన్ చాంపియన్‌షిప్‌లో భారత్ తన పోరాటాన్ని ఘనంగా ముగించింది. గురీందర్‌వీర్ సింగ్, పాలెందర్ కుమార్, మనీష్, అక్షయ్ నైనీలతో కూడిన మెడ్లీ రిలే జట్టు మంగళవారం ఇక్కడ రోజు పసిడి మెరుపులు మెరిపించి భారత్ పోరాటానికి గోల్డెన్ ఫినిష్ ఇచ్చింది. బ్యాంకాక్‌లోని సుపాచలసాయ్ నేషనల్ స్టేడియంలో జరిగిన మెడ్లీ రిలే ఈవెంట్‌లో ఈ జట్టు 1:55.62 టైమింగ్‌తో లక్ష్యాన్ని అధిగమించి పసిడి పతకాన్ని కైవసం చేసుకోగా, చైనీస్ తైపీ (1:55.71 నిమిషాలు) జట్టుకు రజత పతకం, హాంకాంగ్ (1:56.11 నిమిషాలు) జట్టుకు కాంస్య పతకం లభించాయి. ఈ చాంపియన్‌షిప్‌లో చివరి రోజైన మంగళవారం బాలుర జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత్ ఒక రజత పతకాన్ని, మరో కాంస్య పతకాన్ని కూడా కైవసం చేసుకుంది. ఈ ఈవెంట్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రోహిత్ యాదవ్ 74.30 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి రజత పతకాన్ని గెలుచుకోగా, అవినాష్ యాదవ్ (70.09 మీటర్లు)కు కాంస్య పతకం లభించింది. దీంతో ఈ చాంపియన్‌షిప్‌లో భారత్ ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, మరో నాలుగు కాంస్య పతకాలు సహా మొత్తం 14 పతకాలతో మూడో స్థానాన్ని దక్కించుకోగా, చైనా 30 (16 స్వర్ణ, 9 రజత, 5 కాంస్య) పతకాలతో అగ్రస్థానంలోనూ, చైనీస్ తైపీ 15 (6 స్వర్ణ, 7 రజత, 2 కాంస్య) పతకాలతో ద్వితీయ స్థానంలోనూ నిలిచాయి.
మన పతక విజేతలు వీరే
పసిడి పతకాలు: గురీందర్‌వీర్ సింగ్ (బాలుర 100 మీటర్లు), అభిషేక్ మాథ్యూ (బాలుర 800 మీటర్లు), అభయ్ గుప్తా (బాలుర డిస్కస్ త్రో), సంజయ్ కుమార్ (బాలుర 10 కి.మీ నడక), గురీందర్‌వీర్ సింగ్, పాలెందర్ కుమార్, మనీష్, అక్షయ్ నితిన్ (బాలుర మెడ్లీ రిలే).
రజత పతకాలు: దనీత్ సింగ్ (బాలుర హామర్ త్రో), మొహిత్ (బాలుర షాట్‌పుట్), మొహిత్ (బాలుర డెకాథ్లన్), సాహిల్ సిల్వాల్ (బాలుర డిస్కస్ త్రో), రోహిత్ యాదవ్ (బాలుర జావెలిన్ త్రో).
కాంస్య పతకాలు: నితేష్ పూనియా (బాలుర హామర్ త్రో), సీమా (బాలికల 3000 మీటర్ల పరుగు), అక్షయ్ నయిన్ (బాలుర 400 మీటర్ల పరుగు), అవినాష్ యాదవ్ (బాలుర జావెలిన్ త్రో).