క్రీడాభూమి

బిడబ్ల్యుఎఫ్ అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా), మే 24: ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా భారత స్టార్ పివి సింధు ఎన్నికైంది. 21 ఏళ్ల సింధు నామినేషన్‌కు అనుకూలంగా 129 ఓట్లు వచ్చాయి. ఆమెతోపాటు మార్క్ వీబ్లెర్, కిర్‌స్టీ గిల్మోర్ కూడా బిడబ్ల్యుఎఫ్ అథ్లెట్స్ కమిషన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీబ్లెర్‌కు 108 ఓట్లు రాగా, గిల్మోర్‌కు 103 ఓట్లు లభించాయి.
సుదీర్మన్ నాకౌట్‌కు భారత్
గోల్డ్ కోస్ట్: ప్రతిష్ఠాత్మక సుదీర్మన్ కప్ బాడ్మింటన్ టోర్నమెంట్ నాకౌట్‌కు భారత్ అర్హత సంపాదించింది. డెర్మార్క్‌తో జరిగిన గ్రూప్-1డి చివరి పోరులో భారత్ 3-2 తేడాతో విజయం సాధించింది. డెర్మార్క్ చేతిలో మొదటి గ్రూప్ పోటీలో ఓశటమిపాలైన భారత్ ఆతర్వాత ఇండోనేషియాను 4-1 ఆధిక్యంతో చిత్తుచేసిన విషయం తెలిసిందే. తాజా పోరులో డెర్మార్క్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. 2011 తర్వాత భారత్ నాకౌట్‌కు చేరడం ఇదే మొదటిసారి.