క్రీడాభూమి

టీమిండియా టాప్ ఫామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ది ఓవల్ (లండన్), మే 28: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌కు సిద్ధమవుతున్న భారత్ టాప్ ఫామ్‌లో ఉన్నట్టు నిరూపించుకుంది. న్యూజిలాండ్‌ను ఆదివారం వామప్ మ్యాచ్‌లో తలపడిన టీమిండియా అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని కనబరచి, 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా రద్దయిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని భారత్ 38.4 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌట్ చేరింది. ల్యూక్ రోన్చీ (66), జేమ్స్ నీషమ్ (46 నాటౌట్) తప్ప మిగతా వారు రాణించలేకపోయారు. మహమ్మద్ షమీ 47 పరుగులకు మూడు, భువనేశ్వర్ కుమార్ 28 పరుగులకు మూడు చొప్పున వికెట్లు పడగొట్టి, కివీస్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశారు. రవీంద్ర జడేజా నాలుగు ఓవర్లు బౌల్ చేసి, కేవలం ఎనిమిది పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 26 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. అజింక్య రహానే (6), దినేష్ కార్తీక్ (0) తక్కువ స్కోర్లకే అవుట్‌కాగా, శిఖర్ ధావన్ 40 పరుగులు చేశాడు. భారీ వర్షం కారణంగా ఆట నిలిచిపోగా, విరాట్ కోహ్లీ 52, మహేంద్ర సింగ్ ధోనీ 17 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. డక్‌వర్త్ లూయిస్ విధానం ప్రకారం చూస్తే, 26 ఓవర్లలో 84 పరుగులు చేస్తే సరిపోతుంది. ఆ లెక్కన టీమిండియా చాలా ముందంజలో ఉంది. కాగా, ఆటను కొనసాగించే అవకాశం లేదని స్పష్టం చేసిన అంపైర్లు డక్‌వర్త్ లూయస్ విధానంలోనే భారత్‌ను విజేతగా ప్రకటించారు.