క్రీడాభూమి

ధోనీ స్థాయ కీపర్ ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 28: చాంపియన్స్ ట్రోఫీకి వెళ్లిన టీమిండి యాలో సహజంగానే విరాట్ కోహ్లీని స్టార్ అట్రాక్షన్‌గా పేర్కొంటారు. కానీ, న్యూజిలాండ్, భారత్ వామప్ మ్యా చ్‌ని తిలకించడానికి వచ్చిన అభిమానులు కోహ్లీ కంటే ధోనీకే ఎక్కువ మద్దతు ప్రకటించడం గమనార్హం. అతని పేరుతో ప్లకార్డులు ప్రదర్శించి, అతని పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అదే సమయంలో ధోనీ త ర్వాత అతని స్థానంలో జాతీయ జట్టుకు సేవలు అందిం చేది ఎవరన్న ప్రశ్నను కూడా తెరపైకి తెచ్చారు.
కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా ధోనీని మించిన ప్రతిభావంతుడు ఇప్పట్లో దొరకడని చాలా మంది అభిప్రాయం. అయితే, దేశానికి కీపర్లుగా సేవలు అందించిన వారిలో ధోనీ కంటే సమర్థులు ఎంతో మంది ఉన్నారన్న వాదన కూడా వినిపిస్తున్నది. టెస్టు క్రికెట్‌కు అతను గుడ్‌బై చెప్పిన తర్వాత వృద్ధిమాన్ సాహాకు కీపర్‌గా అవకాశం దక్కింది. సాహా గాయపడినప్పుడు, పార్థీవ్ పటేల్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో వీరిద్దరూ తీవ్రంగా పోటీపడుతున్నారు. కాగా, పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన తర్వాత, త్వరలోనే అతను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొన్నప్పటికీ, అతను ఆటగాడిగా జట్టులో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, త్వరలోనే అతను క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న వాదన జోరందుకుంది. దీనితో, ధోనీ తర్వాత వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్‌గా ఉత్తమ సేవలు అందించే సత్తా ఎవరికి ఉందనే ప్రశ్న తెరపైకి వచ్చింది. నిజానికి చాలా మంది క్రికెట్ నిపుణులు ధోనీని నంబర్ వన్ వికెట్‌కీపర్‌గా అంగీకరించడంలేదు. సమర్థులైన భారత కీపర్లలో అతను కూడా ఒకడని, అంతమాత్రం చేత అతనినే ‘ఆల్‌టైమ్ బెస్ట్’గా పేర్కోవడానికి వీల్లేదని స్పష్టం చేస్తున్నారు. సగటులు, రికార్డులను పరిగణలోకి తీసుకొని, మిగతా అంశాలను విస్మరించడానికి వీల్లేదని వాదిస్తున్నారు. ఫరూఖ్ ఇంజనీర్, సయ్యద్ కిర్మాణీ వంటి కీపర్లతో పోలిస్తే ధోనీ ఆ స్థాయిలో ఉండడని చాలా మంది అభిప్రాయం. టెస్టుల్లో ధోనీ సగటు 38 పరుగులుకాగా, ఇంజనీర్ సగటు 31 పరుగులు. అయితే, అవసరాన్ని బట్టి, ఓపెనర్ నుంచి లోయర్ మిడిల్ ఆర్డర్ వరకూ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు దిగేందుకు ఇంజనీర్ సిద్ధంగా ఉండేవాడు. సునీల్ గవాస్కర్‌తో కలిసి పలు టెస్టుల్లో అతను ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభించాడు. కాగా, ధోనీ తన కెరీర్‌లో ఎన్నడూ టాప్ ఆర్డర్‌లో మైదానంలోకి దిగలేదు. 1967లో వెస్టిండీస్‌తో చెన్నైలో జరిగిన టెస్టులో వెస్లీ హాల్, చార్లీ గ్రిఫిత్, గారీ సోబర్స్ వంటి మేటి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని, మొదటి రోజు ఆటలో భోజన విరామానికి ముందే 94 పరుగులు చేసిన ఇంజనీర్‌తో ధోనీని ఏ విధంగా పోలుస్తామని చాలా మంది నిలదీస్తున్నారు. ఆ మ్యాచ్‌లో 109 పరుగులు చేసి అవుటైన ఇంజనీర్ అప్పట్లోనే పరుగుల వరద ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ప్రత్యక్షంగా చూపించాడు. ఆ స్థాయిలో ధోనీ ఆడిన సందర్భాలు దాదాపుగా లేవు. అలాన్ నాట్, రాడ్నీ మార్ష్ వంటి ‘ఆల్‌టైం గ్రేట్’ కీపర్ల సరసన ధోనీకి స్థానం లభించినా, వికెట్‌కీపర్/ బ్యాట్స్‌మన్‌గా అతను సంచలనాలేవీ సృష్టించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అన్ని ఫార్మాట్స్‌లోనూ వికెట్‌కీపర్‌గా ఎక్కువ మందిని అవుట్ చేసిన వారి జాబితాలో మార్క్ బౌచర్, ఆడం గిల్‌క్రిస్ట్ తర్వాత ధోనీకి మూడో స్థానం దక్కుతుంది. కానీ అతను బ్రాడ్ హాడిన్, కుమార సంగక్కర, ఎబి డివిలియర్స్ మాదిరి తన బ్యాటింగ్ ప్రతిభతో ఇన్నింగ్స్‌కు గట్టిపునాది వేసిన సందర్భాలు లేవు. ఎన్నోసార్లు ధోనీ విన్నింగ్ షాట్ కొట్టి, మ్యాచ్‌ని ముగించాడు. అయితే, టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన వారు రాణించడంపైనే ఒక మ్యాచ్‌లో విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి, చాలా మ్యాచ్‌ల్లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌పై కీలక బాధ్యతలంటూ ఏవీ ఉండవు. అందుకే, మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ధోనీకి ఫినిషింగ్ షాట్ కొట్టడం ఏమంత కష్టం కాదు. ఏది ఏమైనా ‘ఆల్‌టైమ్ గ్రేట్’గా ధోనీని అంగీకరించని వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ధోనీపైనే అసంతృప్తిని వ్యక్తం చేసే వారిని సంతృప్తి పరచే సామర్థ్యం ఉన్న కీపర్ భారత జట్టుకు లభిస్తారా అన్నది ప్రశ్న. ఇంజనీర్లు, కిర్మాణీలు కాకపోయినా, కిరణ్ మోరే, నయన్ మోంగియా, ధోనీ స్థాయి కీపర్లనైనా టీమిండియా సంపాదించుకుంటుందా అన్న ప్రశ్నకు సమాధానం లభించడం లేదు. వృద్ధిమాన్ సాహా, పార్థీవ్ పటేల్, రిషభ్ పంత్ తదితరులు కీపింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఉత్సాహపడుతున్నారు. ఎవరికీ వారే తమకు లభించిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లోనే, ధోనీ తర్వాత భారత జట్టుకు సమర్థుడైన వికెట్‌కీపర్ ఎవరన్న ప్రశ్న తలెత్తుతుంది. వయసును, ప్రతిభను పరిగణలోకి తీసుకుంటే, రిషభ్ పంత్ అతి తక్కువ కాలంలోనే భారత కీపర్‌గా స్థిరమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశాలున్నాయి. భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మరో టీనేజ్ ఆటగాడు ఇషాన్ కిషన్ నుంచి రిషభ్ పంత్‌కు గట్టిపోటీ తప్పకపోవచ్చు.