క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ జొకోవిచ్ శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 29: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్, రెండో ర్యాంక్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. మొదటి రౌండ్‌లో అతను మార్సెల్ గ్రానొలర్స్‌పై 6-3, 6-4, 6-2 తేడాతో విజయం సాధించాడు. అద్భుతమైన ప్లేసింగ్స్, బలమైన సర్వీసులతో విరుచుకుపడిన జొకోవిచ్‌కు గ్రానొలర్స్ గట్టిపోటీనిచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ, ప్రపంచ మేటి ఆటగాడి ముందు అతని ప్రయత్నాలు ఫలించలేదు. పురుషుల సింగిల్స్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో గిలెస్ సైమన్‌ను నికొలోస్ బాసిలాన్‌ష్వీ 1-6, 6-2, 6-4, 6-1 తేడాతో ఓడించాడు. హోరాహోరీగా సాగిన పోరులో లుకాస్ పౌలీ 7-6, 3-6, 4-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించాడు. హోరాసియో జెబలస్ 7-5, 6-3, 6-4 స్కోరుతో ఆడ్రియన్ మనారినోపై గెలవగా, డామినిక్ థియేమ్ 6-4, 6-0, 6-2 తేడాతో బెనార్డ్ టామిక్‌ను ఓడించాడు. మరో ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లో మార్కో ట్రంగెలిటి 3-6, 6-7, 7-6, 6-4, 6-4 తేడాతో క్వెటిన్ హాలిస్‌పై విజయం సాధించాడు. మిలోస్ రోనిక్ 6-3, 6-4, 6-2 స్కోరుతో స్టీవ్ డార్సిస్‌పై గెలిచాడు. జాన్ మిల్‌మన్‌ను రాబర్ట్ బటిస్టా అగుట్ 6-2, 6-2, 0-6, 6-1 తేడాతో ఓడించాడు.

స్టేడియంలో తొక్కిసలాట
నలుగురు అభిమానులు మృతి
టెగుసిగల్పా (హోండురాస్), మే 29: హోండురాస్ జాతీయ స్టేడియంలో జరిగిన తొక్కిసలాట సంఘటలో నలుగురు ఫుట్‌బాల్ అభిమానులు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మొటగువా, హోండురాస్ ప్రోగ్రెసో జట్ల మధ్య మ్యాచ్‌ని తిలకించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీనితో ఆ ప్రాంతం క్రిక్కిరిసిపోగా, టికెట్ దొరికిన వారు మ్యాచ్ మొదలవుతుందేమోనన్న భయంతో స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనితో 11వ నంబర్ గేట్ వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరినొకరు నెట్టుకుంటూ, ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగినట్టు అధికారులు ప్రకటించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్టు తెలిపారు.

నాదల్ విజృంభణ
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌ను రికార్డు స్థాయిలో తొమ్మిది పర్యాయాలు కైవసం చేసుకున్న ప్రపంచ నాలుగో ర్యాంక్ ఆటగాడు రాఫెల్ నాదల్ ఈసారి మొదటి రౌండ్‌లో విజృంభించాడు. జెయింట్ కిల్లర్‌గా పేరుపొందిన బెనొట్ పైరెను 6-1, 6-4, 6-1 స్కోరుతో సునాయాసంగా ఓడించాడు. తరచు గాయాలబారిన పడుతూ, ఫ్రెంచ్ ఓపెన్‌లో జైత్ర యాత్రను కొనసాగించలేకపోతున్న ఈ ‘క్లేకోర్టు వీరుడు’ ఇటీవలే మాడ్రిడ్ ఓపెన్ టైటిల్‌ను అందుకొని, ఫామ్‌ను నిరూపించుకున్నాడు. అదే ఊపుమీద ఉన్న అతను మొదటి రౌండ్‌లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచాడు.

అశ్విన్ ఆడతాడా?
లండన్, మే 29: భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడతాడా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతున్నది. అశ్విన్ తాత నారాయణ స్వామి సోమవారం మృతి చెందినట్టు చెన్నైలో అతని కుటుంబ సభ్యులు ప్రకటించారు. అశ్విన్‌ను క్రికెటర్‌గా తీర్చిదిద్దడంలో నారాయణ స్వామిది కీలక పాత్ర. తాత చనిపోయిన దుఃఖంలో అశ్విన్ మ్యాచ్‌ని ఆడగలడా అన్న ప్రశ్న వినిపిస్తున్నది. అయితే, జట్టు మేనేజ్‌మెంట్ ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.