క్రీడాభూమి

సు-వెయి సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 30: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తైవాన్ క్రీడాకారిణి హియె సు-వెయి (31) సంచలనం సృష్టించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 109వ స్థానంలో కొనసాగుతున్న ఆమె మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో బ్రిటన్‌కు చెందిన ఏడో సీడ్ క్రీడాకారిణి జొహన్నా కోంటాకు చెక్‌పెట్టి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ ఆరంభంలో ఘోరంగా చతికిలబడి 1-6 తేడాతో తొలి సెట్‌ను చేజార్చుకున్న హియె సు-వెయి ఆ తర్వాత పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించి ప్రత్యర్థిపై అనూహ్య రీతిలో విరుచుకుపడింది. ఫలితంగా 7-6(7/2), 6-4 తేడాతో వరుసగా రెండు సెట్లను కైవసం చేసుకుని కోంటాను మట్టికరిపించింది. ప్రపంచ టాప్-10 ర్యాంకుల జాబితాలోని క్రీడాకారిణిపై సు-వెయి విజయం సాధించడం ఇదే మొదటిసారి.
మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌లలో ఫ్రెంచి ఆశాకిరణం క్రిస్టినా మ్లదెనోవిచ్, ఉక్రెయిన్‌కు చెందిన ఐదో సీడ్ క్రీడాకారిణి ఎలినా స్వెతోలినా కూడా తమతమ ప్రత్యర్థులపై విజయం సాధించి శుభారంభాన్ని అందుకున్నారు. ఈ టోర్నీలో 13వ సీడ్‌గా బరిలోకి దిగిన మ్లదెనోవిచ్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నప్పటికీ 3-6, 6-3, 8-6 సెట్ల తేడాతో అమెరికా క్రీడాకారిణి జెన్నీఫర్ బ్రాడీని ఓడించి రెండో రౌండ్‌లో ప్రవేశించింది. అలాగే స్వెతోలినా 6-4, 6-3 తేడాతో కజకిస్తాన్‌కు చెందిన యారోస్లావా స్వెదోవాకు చెక్ పెట్టింది.
రెండో రౌండ్‌కు ముర్రే
పురుషుల సింగిల్స్‌లో బ్రిటన్‌కు చెందిన టాప్ సీడ్ ఆటగాడు ఆండీ ముర్రేతో పాటు మాజీ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రిన్కా, ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ శుభారంభాన్ని సాధించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగు తున్న ముర్రే మంగళవారం ఇక్కడ జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో 6-4, 4-6, 6-2, 6-0 తేడాతో ఆండ్రీ కుజ్నెత్సోవ్‌ను ఓడించగా, వావ్రిన్కా 6-2, 7-6(8/6), 6-3 తేడాతో జోయెఫ్ కొవాలిక్‌పై, కిర్గియోస్ 6-3, 7-6, 6-3 తేడాతో జర్మనీకి చెందిన ఫిలిప్ ఖోల్‌స్క్రైబర్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. అయతే రోమ్ మాస్టర్స్ టోర్నీలో జొకోవిచ్‌పై విజయం సాధించి సంచలనం సృష్టించిన అలెగ్జాండర్ జ్వెరెవ్ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలయ్యాడు.