క్రీడాభూమి

వీళ్లూ సమర్థులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ది ఓవల్ (లండన్), మే 31: ఈసారి చాంపియన్స్ ట్రోఫీలో అద్వితీయ ప్రతిభ కనబరిచే కొంత మంది బ్యాట్స్‌మెన్, బౌలర్లను విశే్లషకులు ప్రస్తావిస్తుండగా, మరి కొంత మందిని కూడా సమర్థులుగానే అభిమానులు పేర్కొంటున్నారు. వివిధ జట్లలో ఉన్న పలువురు యువ, సీనియర్ ఆటగాళ్లు ఈ టోర్నీలో సవాళ్లు విసరడానికి సిద్ధంగా ఉన్నారని వారి అభిప్రాయం. అభిమానుల అంచనా ప్రకారం చాంపియన్స్ ట్రోఫీని హోరాహోరీ పోరాటాల యుద్ధ భూమిగా మార్చే సత్తావున్న వారి జాబితా పెద్దదిగానే ఉంది. ఇంగ్లాండ్ జట్టుకు వికెట్‌కీపర్‌గానేగాక, స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గానూ సేవలు అందిస్తున్న జొస్ బట్లర్‌ను ఈ జాబితాలో నంబర్ వన్‌గా పేర్కోవాలి. స్వదేశంలో జరుగుతున్న టోర్నీలో అతను తన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు అండగా నిలుస్తాడు. దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్ క్వింటన్ డి కాక్ కూడా సమర్థుడైన బ్యాట్స్‌మన్‌గా పేరు సంపాదించాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మోజెస్ హెన్రిక్స్, పాకిస్తాన్ సీనియర్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్, శ్రీలంక విలక్షణ పేసర్ లసిత్ మలింగ, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ మెక్‌క్లీనగన్, బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మోజెస్ హెన్రిక్స్ తదితరులు కూడా చాంపియన్స్ ట్రోఫీలో తమను తాము నిరూపించుకోనున్నారు. వీరిలో ఎక్కువ మంది పదో ఐపిఎల్‌లో తమతమ జట్లకు ఉత్తమ సేవలు అందించి, మంచి ఫామ్‌లో ఉండడంతో, చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు వీరి చేరికతో ఉత్కంఠగా మారడం ఖాయమని అభిమానులు అంటున్నారు.
భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ పేరును ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. 11 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత అతను మరోసారి చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటున్నాడు. దీనితో అందరి దృష్టి అతనిపై కేంద్రీకృతమైంది. ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన యువీ ఇంగ్లాండ్‌లోనూ సత్తా చాటుతాడని అతని అభిమానులు ధీమాతో ఉన్నారు.