క్రీడాభూమి

ఎనిమిదోసారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ది ఓవల్ (లండన్), మే 31: చాంపియన్స్ ట్రోఫీ ఎనిమిదోసారి జరగనుంది. 1998లో ఆరంభమైన ఈ ‘మినీ ప్రపంచకప్’ను తొలిసారి దక్షిణాఫ్రికా గెల్చుకుంది. నాటి ఫైనల్‌లో ఆ జట్టు వెస్టిండీస్‌ను ఓడించింది. 2000లో భారత్‌పై విజయం సాధించిన న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. 2002లో వర్షం కారణంగా ఫైనల్ జరగలేదు. దీనితో భారత్, శ్రీలంక జట్లను సంయుక్తంగా చాంపియన్స్‌గా ప్రకటించారు. 2004 ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన వెస్టిండీస్ టైటిల్ అందుకుంది. 2006లో వెస్టిండీస్‌ను ఫైనల్‌లో చిత్తుచేసి ఆస్ట్రేలియా టైటిల్ సాధించింది. అప్పటి వరకూ ప్రతి రెండేళ్లకోసారి ఈ టోర్నీ జరగ్గా, ఐదో చాంపియన్స్ ట్రోఫీ మూడేళ్ల తర్వాత, 2009లో జరిగింది. న్యూజిలాండ్‌ను ఫైనల్‌లో ఓడించిన ఆస్ట్రేలియా విజేతగా అవతరించింది. ఆతర్వాత 2013లో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు. టెస్టు చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తామని, కాబట్టి చాంపియన్స్ ట్రోఫీ అవసరం లేదని అప్పట్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించింది. అదే చివరి చాంపియన్స్ ట్రోఫీగా స్పష్టం చేసింది. ఫలితంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న అప్పటి పోటీల్లో భారత్ అద్వితీయ ప్రతిభ కనబరచింది. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై గెలిచింది.
టెస్టు చాంపియన్‌షిప్‌కు అనుకున్నంత స్పందన రాకపోవడంతో, ఆ ఆలోచనను విరమించుకున్న ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ కొనసాగుతుందని ప్రకటించింది. ఐసిసి నిర్ణయం మారిన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా రంగ ప్రవేశం చేస్తున్నది. గురువారం మొదలయ్యే ఈ టోర్నమెంట్ 18 వరకూ కొనసాగుతుంది. మొత్తం ఎనిమిది జట్లు, 15 మ్యాచ్‌లు ఆడతాయి. గ్రూప్ ‘ఎ’లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ఉండగా, గ్రూప్ ‘బి’ నుంచి భారత్, పాకిస్తాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు పోటీపడుతున్నాయి.