క్రీడాభూమి

మరో టైటిల్‌పై శ్రీకాంత్ గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జూన్ 19: ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో విజేతగా ఆవిర్భవించి కెరీర్‌లో మూడో సూపర్ సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకున్న గుంటూరు యువకుడు కిదాంబి శ్రీకాంత్ ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌పై దృష్టి కేంద్రీకరించాడు. క్వాలిఫయర్ పోటీలతో మంగళవారం నుంచి ప్రారంభయమ్యే ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు శ్రీకాంత్‌తో పాటు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సారథ్యం వహించనున్నారు. ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో ఆదివారం టైటిల్ సాధించడానికి ముందు ఏప్రిల్‌లో జరిగిన సింగపూర్ ఓపెన్ టోర్నీలోనూ ఫైనల్‌కు చేరుకుని మంచి ఫామ్‌లో ఉన్న శ్రీకాంత్ ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. బుధవారం క్వాలిఫయర్‌తో జరిగే మ్యాచ్‌తో శ్రీకాంత్ ఈ టోర్నీలో తన పోరాటాన్ని ప్రారంభించనున్నాడు. ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో విజేతగా నిలవడం ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందని, ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు ఆస్ట్రేలియా ఓపెన్ చివరి టోర్నీ కావడంతో ప్రస్తుతం దీనిపై దృష్టి కేంద్రీకరించానని, ఈ టోర్నీలో కూడా పూర్తి స్థాయిలో రాణించేందుకు నూటికి నూరు శాతం ప్రయత్నిస్తానని శ్రీకాంత్ స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియా ఓపెన్‌లో శ్రీకాంత్‌తో పాటు హెచ్‌ఎస్.ప్రణయ్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాడు. ‘జెయింట్ కిల్లర్’గా పేరు పొందిన అతను ఇండోనేషియా సూపర్ సిరీస్‌లో అద్భుతంగా రాణించి ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్‌తో పాటు రజత పతక విజేత లీ చోంగ్ వెయ్‌పై సంచలన విజయాలు సాధించడమే ఇందుకు కారణం. ఈ టోర్నీ సెమీ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన కజుమసా సకాయ్ చేతిలో ఓటమిపాలైన ప్రణయ్ మంగళవారం ఆస్ట్రేలియా ఓపెన్ క్వాలిఫయర్ పోటీలో అతనిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్నాడు.
అయితే లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌తో పాటు రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్న ‘తెలుగు తేజం’ పివి.సింధుకి ఆస్ట్రేలియా ఓపెన్ ఆరంభంలోనే విషమ పరీక్ష ఎదురుకానుంది. ఈ టోర్నీ తొలి రౌండ్‌లో సైనా నెహ్వాల్ ఇండోనేషియా ఓపెన్‌లో రన్నరప్ టైటిల్‌ను గెలుచుకున్న జీ హ్యున్ (కొరియా)తో తలపడనుండగా, సింధు ఇండోనేషియా ఓపెన్ విజేత సయాకా సాటో (జపాన్)తో తలపడనుంది. సింధు గత వారం ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోరులో నిచవోన్ జిందాపోల్ (్థయిలాండ్) చేతిలో ఓటమిపాలవగా, అంతగా పరిచయం లేని బీవెన్ జంగ్ (అమెరికా) సింధును ఓడించిన విషయం విదితమే. ఈ ఓటముల నుంచి త్వరగా కోలుకుని ఆస్ట్రేలియా ఓపెన్‌లో రాణించాలని సైనా, సింధు ఎదురు చూస్తున్నారు.
వీరితో పాటు ఏప్రిల్‌లో ముగిసిన సింగపూర్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచి కెరీర్‌లో తొలిసారి సూపర్ సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకున్న బి.సాయి ప్రణీత్ కూడా ఆస్ట్రేలియా ఓపెన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాడు. ఇండోనేషియా ఓపెన్ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలైన ప్రణీత్ ఆస్ట్రేలియా ఓపెన్ తొలి రౌండ్‌లో టామీ సుగియార్తో (ఇండోనేషియా)తో తలపడనుండగా, సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రీ గోల్డ్ టైటిల్ విజేత సమీర్ వర్మ చైనీస్ తైపీకి చెందిన జు వెయ్ వాంగ్‌తోనూ, అజయ్ జయరామ్ హాంకాంగ్‌కు చెందిన ఏడో సీడ్ ఆటగాడు లాంగ్ అంగస్‌తోనూ తలపడనుండగా, పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో మను అత్రి, బి.సుమిత్ రెడ్డి మూడో సీడ్ జోడీగా బరిలోకి దిగుతున్న తకెషి కమురా, కెయిగో సొనోడా (జపాన్)తోనూ, రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి హాంకాంగ్‌కు చెందిన లా చెయుక్ హిమ్, లీ చున్ హెయ్ జోడీతోనూ, మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో అశ్వనీ పొన్నప్ప, ఎన్.సిక్కీ రెడ్డి ఆస్ట్రేలియాకు చెందిన హ్యున్ యు వెండీ చెన్, జెన్నీఫర్ టామ్ జోడీతోనూ, మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో అశ్వనీ పొన్నప్ప, సాత్విక్ సాయిరాజ్ హాంకాంగ్‌కు చెందిన లీ చున్ హెయ్ చౌ హొయ్ వా జోడీతోనూ తలపడనున్నారు.
చిత్రం.. కిదాంబి శ్రీకాంత్