క్రీడాభూమి

ప్రపంచ జిమ్నాస్టిక్స్‌కు దీపా కర్మాకర్ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత పూర్తిగా కోలుకోక పోవడంతో, ఈ ఏడాది అక్టోబర్ మాసంలో కెనడాలో జరిగే ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్స్ నుంచి దీపా కర్మాకర్ వైదొలగింది. రియో ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరడం ద్వారా సంచలనం సృష్టించిన ఆమె ఆతర్వాత అంతర్జాతీయ పోటీలకు హాజరుకాలేదు. కాలి కండరాలు బెణకడంతో బాధపడిన ఆమెకు ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం పునరావాస శిబిరంలో ఉన్న ఆమె పూర్తి ఫిట్నెస్ లేని కారణంగా ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనలేకపోతున్నానని గురువారం పిటిఐతో మాట్లాడుతూ చెప్పింది. ఇది నిరాశపరిచే విషయమేనని, అయితే, తన కెరీర్‌కు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జరిగే కామనె్వల్త్, ఆసియా క్రీడలపై దృష్టి కేంద్రీకరిస్తానని చెప్పింది.

చిత్రం.. దీపా కర్మాకర్