క్రీడాభూమి

కెరీర్‌కు రోన్చీ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి, జూన్ 22: న్యూజిలాండ్ వికెట్‌కీపర్ ల్యూక్ రోన్చీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా టి-20 ఫార్మాట్‌లో జరిగే టోర్నీల్లో అతను ఆడతాడు. న్యూజిలాండ్‌లో పుట్టినప్పటికీ, ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన అతను ఆ దేశం తరఫున నాలుగు వనే్డలు, మూడు టి-20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఆతర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి, కివీస్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తం మీద అతను కెరీర్‌లో నాలుగు టెస్టులు, 85 వనే్డలు, 32 టి-20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. టెస్టుల్లో 5 క్యాచ్‌లు పట్టాడు. వనే్డల్లో 105 క్యాచ్‌లు పట్టి, 12 స్టంపింగ్స్ చేశాడు. అదే విధంగా టి-20 ఇంటర్నేషనల్స్‌లో 24 క్యాచ్‌లు అందుకున్నాడు. ఐదుగురిని స్టంప్ చేశాడు. వనే్డల్లో 189 (నాటౌట్), టెస్టుల్లో 88 అతని అత్యధిక పరుగులు.

చిత్రం.. ల్యూక్ రోన్చీ