క్రీడాభూమి

‘ఒక రాష్ట్రానికి ఒకే ఓటు’పై చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 25: లోధా కమిటీ సూచించిన ‘ఒక రాష్ట్రానికి ఒకే ఓటు’ విధానం అమలు ప్రధాన అంశంగా సోమవారం ఇక్కడి ప్రధాన కార్యాలయంలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సమావేశం కానుంది. చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే రాజీనామా, కొత్త కోచ్ ఎంపిక వంటి పలు కీలక అంశాలు కూడా ఈ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. బోర్డులో 30 యూనిట్లకు సభ్యత్వం ఉందని, అయితే, సర్వీసెస్, రైల్వేస్ వంటి యూనిట్లకు సరిహద్దులంటూ ఏవీ లేవన్న విషయాన్ని లోధా కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి మూడేసి సంఘాలకు బిసిసిఐలో సభ్యత్వం ఉన్న విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొంది. ఈ విధమైన అసమానతలను తొలగించి, ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో సంఘానికి మాత్రమే బిసిసిఐలో సభ్యత్వం ఉండాలని లోధా కమిటీ తేల్చిచెప్పింది. బోర్డు అధ్యక్షుడికి మూడు ఓట్లు వేసే హక్కును తీసివేయాలని సూచించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలను అనుసరించి, తాను ప్రాతినిథ్యం వహించే క్రికెట్ సంఘం తరఫున ఒకటి, బోర్డు అధ్యక్షుడి హోదాలో మరొకటి ఓటు ఉంటుంది. ఏదైనా అంశంపై ఓటింగ్ జరిగినప్పుడు, అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన సంఖ్యలో ఓట్లు పోలైతే, కాస్టింగ్ ఓటు వేసే అధికారం కూడా అధ్యక్షుడికి ఉంటుంది. ఈ విధంగా ఒక వ్యక్తికి మూడు ఓట్లు ఎందుకని లోధా కమిటీ ప్రశ్నించింది. అధ్యక్షుడికి కూడా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెట్ సంఘం తరఫున ఒక ఓటు ఉంటే సరిపోతుందని తెలిపింది. కాగా, చాలాకాలంగా ‘ఒక రాష్ట్రానికి ఒకే ఓటు’ నిబంధనను అమలు చేసేందుకు బిసిసిఐ నిరాకరిస్తూ వస్తున్నది. సర్వీసెస్, ముంబయి, రైల్వేస్ వంటి జట్లు భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించాయని పలు సందర్భాల్లో గుర్తు చేసింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి దేశానికి దాదాపుగా ప్రాతినిథ్యం లేదని పేర్కొంది. ఒక రాష్ట్రానికి ఒకే ఓటు ఉండాలనడం అసమానతలను పెంచిపోషించడమేనని వాదించింది. కానీ, లోధా కమిటీ సిఫార్సులను అమలు చేసి తీరాలని సుప్రీం కోర్టు స్పష్టం చేయడమేగాక, ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి పాలనాధికారుల బృందం (సిఒఎ)ను నియమించింది. దీనితో ‘ఒక రాష్ట్రం... ఒక ఓటు’ విధానంతోపాటు లోధా కమిటీ చేసిన ఇతర సూచనలను కూడా అమలు చేసే విషయాన్ని సోమవారం నాటి సమావేశంలో బిసిసిఐ చర్చిస్తుంది.
కొత్త కోచ్ ఎవరు?
టీమిండియాకు కొత్త కోచ్‌ని ఎంపిక చేసే బాధ్యతను సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ సభ్యులుగా వ్యవహరిస్తున్న క్రికెట్ సలహా మండలి (సిఎసి)కి అప్పచెప్పినట్టు ప్రకటించినప్పటికీ, కుంబ్లే రాజీనామా వ్యవహారం, కోహ్లీతో అతనికి విభేదాలు తలెత్తినట్టు వస్తున్న వార్తలపై ఎస్‌జిఎం చర్చించనుంది. కోచ్ పదవికి గత నెల చివరిలోగా దరఖాస్తు చేసుకోవాలని తొలుత ప్రకటించిన బోర్డు ఆతర్వాత కుంబ్లే రాజీనామాతో కంగుతిని, మరిన్ని దరఖాస్తులు స్వీకరించడానికి వీలుగా గడువును పొడిగించింది. ఈ నేపథ్యంలో, అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, అనుభవం వంటి కీలక అంశాలను ఎస్‌జిఎంలో చర్చిస్తారని సమాచారం. అదే విధంగా కుంబ్లేతో కోహ్లీ విభేదించాడని, సుమారు ఆరు నెలలుగా వీరిద్దరి మధ్య మాటలు లేవని వార్తలు రావడంతో, విమర్శలకు తెరదించేప్రయత్నం కూడా చేయనుంది. మొత్తం మీద సోమవారం నాటి ఎస్‌జిఎం బిసిసిఐ భవిష్యత్తును నిర్దేసిస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సమావేశానికి సిఒఎ స భ్యులు కూడా హాజరుకానుండడంతో తీర్మానాలపై సర్వ త్రా ఆసక్తి నెలకొంది.
మళ్లీ తెరపైకి శ్రీనివాసన్
ముంబయ, జూన్ 25: స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో పరువు పోగొట్టుకొని, చివరికి పదవిని కూడా కోల్పోయన బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ మరోసారి తెరపైకి వచ్చాడు. శనివారం వివిధ రాష్ట్రాల క్రికెట్ సంఘాల ప్రతినిధులు పాలనాధికారుల బృందంతో సమావేశమయ్యారు. తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌టిఎ) అధ్యక్షుడిగా శ్రీనివాసన్ కూడా ఈ సమావేశానికి రావడం చర్చనీయాంశమైంది. లోధా సిఫార్సులను అనుసరించి బోర్డులో పరస్పర సహాయక పదవుల్లో ఎవరూ కొనసాగేందుకు వీల్లేదు. అయతే, ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి యజమానిగా ఉన్న శ్రీనివాసన్ టిఎన్‌టిఎ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నాడు. సమావేశాలకు అతను హాజరుకావచ్చా లేదా అన్న చర్చ జరుగుతోంది.